Lok Sabha Elections 2024: తెలంగాణలో పోలింగ్ షురూ.. ఈ ప్రాంతంలో 4 గంటల వరకే పోలింగ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన ఎన్నికల అధికారులు. పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్  కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ, ఒక కంటోన్మెంట్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది. 17 పార్లమెంటు స్థానాలకుగానూ 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Lok Sabha Elections 2024: తెలంగాణలో పోలింగ్ షురూ.. ఈ ప్రాంతంలో 4 గంటల వరకే పోలింగ్
Telangana Elections
Follow us
Srikar T

|

Updated on: May 13, 2024 | 7:04 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన ఎన్నికల అధికారులు. పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్  కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ, ఒక కంటోన్మెంట్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది. 17 పార్లమెంటు స్థానాలకుగానూ 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనున్నట్లు తెలిపారు అధికారులు. పోలింగ్ పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులుఉన్నారు. ఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. 160 కేంద్ర కంపెనీల CAPF బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. –

ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 20వేల మంది పోలీస్ బలగాలను మొహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో పురుష ఓటర్లు – 1కోటి 65లక్షల 28వేలు కాగా మహిళా ఓటర్లు 1కోటి 67లక్షల మంది ఉన్నారు. 18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు కాగా వికలాంగులు 5లక్షల 27వేలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లను అందుబాటులో ఉంచారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9,900 ఉన్నట్లు గుర్తించింది ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను జూన్ 4వ తేదిన విడుదల చేయనున్నారు.

లైవ్ వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే