AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election 2024: సెల్ఫీ దిగడానికి పోలింగ్‌ కేంద్రంలోకి ఫోన్‌ తీసుకెళ్తున్నారా.? అధికారులు ఏమంటున్నారంటే..

దీంతో పోలీసులు సైతం అన్ని పటిష్ట చర్యలను చేపట్టారు. ఇప్పటికే 144 సెక్షన్‌ అమలుతో పాటు, మద్యం దుకాణాలను మూసివేశారు. ఇక ఇదిలా ఉంటే పోలింగ్‌కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక సందేహం వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటిలో పోలింగ్ స్టేషన్‌కు మొబైల్‌ ఫోన్‌ను తీసుకొళ్లొచ్చా.? లేదా.? అన్న సందేహం ఒకటి. ఇటీవల సెల్ఫీ డ్రెండ్‌ పెరిగింది...

Election 2024: సెల్ఫీ దిగడానికి పోలింగ్‌ కేంద్రంలోకి ఫోన్‌ తీసుకెళ్తున్నారా.? అధికారులు ఏమంటున్నారంటే..
Elections 2024
Narender Vaitla
|

Updated on: May 12, 2024 | 5:15 PM

Share

లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మే13వ తేదీన (సోమవారం) జరగనున్న ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు ప్రారంభించారు. అటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. 4వ విడుదలో 10 రాష్ట్రాల్లోని 96 ఎంపీ స్థానాలకు పోలింగ్‌ జరనుండగా. ఏపీలో 175 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

దీంతో పోలీసులు సైతం అన్ని పటిష్ట చర్యలను చేపట్టారు. ఇప్పటికే 144 సెక్షన్‌ అమలుతో పాటు, మద్యం దుకాణాలను మూసివేశారు. ఇక ఇదిలా ఉంటే పోలింగ్‌కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక సందేహం వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటిలో పోలింగ్ స్టేషన్‌కు మొబైల్‌ ఫోన్‌ను తీసుకొళ్లొచ్చా.? లేదా.? అన్న సందేహం ఒకటి. ఇటీవల సెల్ఫీ డ్రెండ్‌ పెరిగింది.

చాలా మంది ఓటు వేసిన తర్వాత వేలిపై ఉండే ఇంకును చూపిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. వీటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. మేం ఓటు వేశాం, మీరు కూడా వేయండి అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే ఇది బాగానే ఉన్నా. స్మార్ట్‌ ఫోన్‌లను ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఒకవేళ ఎవరైనా పొరపాటున స్మార్ట్ ఫోన్‌ తీసుకొచ్చినా స్విచ్ఛాఫ్‌ చేసి భద్రతా సిబ్బంది లేదా పోలింగ్ సిబ్బంది లేదా బీఎల్‌ఓ వద్ద ఇవ్వాల్సి ఉంటుంది.

ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ బూత్‌లోకి స్మార్ట్ ఫోన్‌తో పాటు కెమెరాలాంటి వాటిని అనుమతించరు. కాగా చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం ఈసీ డిజ‌ట‌ల్ ఓట‌ర్ స్లిప్పుల‌ను తీసుకొచ్చింది. ఓట‌ర్ స్లిప్పుల్లో క్యూఆర్ కోడ్‌ను ముద్రించింది. దీన్ని స్కాన్ చేయ‌డం వ‌ల్ల మ‌న పోలింగ్ కేంద్రం వివ‌రాలు తెలుస్తాయి. పోలింగ్ కేంద్రానికి వెళ్లాలో రూట్ కూడా గూగుల్ మ్యాప్ సాయంతో చూపిస్తుంది.

మరిన్ని ఎన్నికల సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..