Tomato Price: హడలెత్తిస్తున్న టామాటా ధరలు.. ఏ ప్రాంతంలో ఎంత ధర ఉందంటే..!
Tomato Price: పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గిందని ఊపిరిపీల్చుకున్న సమయంలో మళ్లీ నిత్యవసర వస్తువులు పెరుగుతూనే ఉన్నాయి.
Tomato Price: పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గిందని ఊపిరిపీల్చుకున్న సమయంలో మళ్లీ నిత్యవసర వస్తువులు పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్లో టమాట ధరలు 120 పలుకుతున్నాయి. వర్షాల వల్ల పంట రాలిపోయి, ఎందుకు సగం కుళ్లిపోయి దిగుమతి రాక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. సరుకు తక్కువ రావడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. టమాట కొనాలన్నా కూడా భయపడుతున్నారు వినియోగదారులు. అసలు కొనేటట్టు లేదు అని వాపోతున్నారు.
అవును, టమోటా ధర మోత మోగుతోంది. సెంచరీ దాటేసి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో కిలో టమోటా వంద నుంచి నూట యాభై వరకు పలుకుతోంది. ఒక్కోచోట ఒక్కోలా ధర పలుకుతోన్నా, రేటు మాత్రం గుండె గుభేల్‌మనేలా రీసౌండ్ వస్తోంది. ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ టమోటా ధరలు అదిరిపోతున్నాయ్. టమోటా కొనాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. వారం రోజుల క్రితం అమాంతం పెరిగిన టమోటా ధరలు, ఒక్కసారిగా హాఫ్ సెంచరీని దాటేసి చుక్కలు చూపించాయ్. ఇప్పుడు ఏకంగా సెంచరీనే క్రాస్ చేశాయ్. కిలో టమోటా వంద రూపాయలు క్రాస్ చేయడమే కాదు, కొన్నిచోట్ల 150 రూపాయల వరకు పలుకుతోంది. దాంతో, టమోటా వైపు చూడాలంటేనే సామాన్యులు వణికిపోతున్నారు.
హైదరాబాద్‌లో కిలో టమోటా ధర వందకు పైనే పలుకుతోంది. క్వాలిటీ పెరిగేకొద్దీ రేటు కూడా పెరుగూ పోతోంది. టమోట రేటును చూసి కొనకుండానే వెనుదిరుగుతున్నారు వినియోగదారులు. ఈ రేటు కూడా రైతు బజార్లలోనే. అదే చిల్లరగా కొనాలంటే మరో పది ఇరవై రూపాయలు అదనంగా పెట్టాల్సిందే.(spot) టమోటా ధర ఈ రేంజ్‌లో పెరగడానికి అనేక రీజన్స్ కనిపిస్తున్నాయ్. ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలు… టమోటా దిగుబడిపై ఎఫెక్ట్ చూపించాయ్. పంట దిగుబడి తగ్గిపోవడంతో ఆటోమోటిక్‌గా రేట్లు పెరిగిపోయంటున్నారు రైతులు. అయితే, వ్యాపారుల సిండికేట్ కూడా రేట్లు పేలిపోవడానికి కారణమనే మాట వినిపిస్తోంది. టమోటా ఊచకోత ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కొత్త పంట చేతికొచ్చేవరకూ టమోటా హైరేట్స్ తప్పదనే మాట మార్కెట్ నుంచి వినిపిస్తోంది. సో, ఆమధ్య ఐదు పది రూపాయలకు కూడా వచ్చిన కిలో టమోటా… ఇప్పుడు వంద నుంచి నూట యాభైకి చేరడంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు ప్రజలు.