KCR Bangalore Tour: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్‌.. టూర్‌ వెనుక అసలు కారణం ఇదేనా.?

KCR Bangalore Tour: దేశ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్.. గురువారం బెంగుళూరులో బిజీ బిజీగా గడపబోతున్నారు. మాజీ పీఎం దేవగౌడ, సీఎం కుమారస్వామితో కీలక చర్చలకు ప్లాన్ చేశారు...

KCR Bangalore Tour: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్‌.. టూర్‌ వెనుక అసలు కారణం ఇదేనా.?
Cm Kcr
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 26, 2022 | 1:14 PM

KCR Bangalore Tour: దేశ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్.. గురువారం బెంగుళూరులో బిజీ బిజీగా గడపబోతున్నారు. మాజీ పీఎం దేవగౌడ, సీఎం కుమారస్వామితో కీలక చర్చలకు ప్లాన్ చేశారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇది డమ్మీ టూర్ అంటున్నాయి. ఇంతకీ ఆయన టూర్ వెనుక అసలు కారణమేంటి.? దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా దేశవ్యాప్త పర్యటనలకు మళ్లీ రెడీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్.. ఇవాళ బెంగుళూరులో పర్యటించబోతున్నారు. బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. దేవెగౌడ నివాసంలో లంచ్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దేశంలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చిస్తారని తెలుస్తోంది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలతో పాటు కేంద్ర విధానాలపై సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగుళూర్ షెడ్యూల్‌ ఖరారైంది. దేశంలో ప్రబల మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్‌.. అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చిస్తారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో పర్యటిస్తున్న కేసీఆర్‌.. ఇటీవలే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప‌ర్యటించారు. పలువురు జాతీయ స్థాయి నాయకులను వరుసగా కలుస్తున్నారు. ఇవాళ బెంగళూరుకు వెళ్తున్నారు. అయితే కేసీఆర్ షెడ్యూల్‌పై రాష్ర బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మోదీకి మొహం చూపించుకోలేకే బెంగుళూరు పారిపోతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని వస్తున్నారు. కానీ ఆయన హైదరాబాద్ వచ్చే సమయంలోనే కేసీఆర్ బెంగుళూరులో ల్యాండ్ అవబోతున్నారు. బిజీ షెడ్యూల్‌ కారణంగా సీఎం రావడం లేదని ISB డీన్‌ మదన్‌ పిల్లుట్ల ధ్రువీకరించారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు సాధారణంగా ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతుంటారు. కానీ, TRS- బీజేపీ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈ సంప్రదాయం మారుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 5న హైదరాబాద్‌కు మోదీ వచ్చినప్పడు కూడా కేసీఆర్‌ స్వాగతం పలకలేదు. నాడు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం పలికారు. గడిచిన రెండేళ్లలో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..