Andhra Pradesh: ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
దేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు మే25 బుధవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
(Election Commission) దేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు మే25 బుధవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఆత్మకూరు ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఇకపోతే, ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి మే నెల 30న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలుకు జూన్ 6 వరకు గడువు విధించింది. జూన్7న నామినేషన్ల పరిశీలన, జూన్ 9 వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. 26న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
- దేశవ్యాప్తంగా ఉప ఎన్నిక జరిగే స్థానాలు
- ఉత్తర ప్రదేశ్: రెండు ఎంపీ స్థానాలు
- పంజాబ్: ఒక ఎంపీ స్థానం
- త్రిపుర: నాలుగు అసెంబ్లీ స్థానాలు
- ఆంధ్రప్రదేశ్: ఒక అసెంబ్లీ స్థానం
- ఢిల్లీ: ఒక అసెంబ్లీ స్థానం
- జార్ఖండ్: ఒక అసెంబ్లీ స్థానం