Viral  Video: ఇలాంటి చోర్‌గాళ్లు కూడా ఉంటారు మరీ తస్మాత్ జాగ్రత్త..! చోరీ వీడియో వైరల్‌!!

ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్, వైరల్‌ న్యూస్‌కి కొదవే లేకుండా పోయింది. ఇంటర్నెట్ ఆన్ చేస్తే చాలు ఫన్నీ వీడియోస్ తెగ కనిపించేస్తుంటాయి.. ఇలా సరదాగా ఉండే

Viral  Video: ఇలాంటి చోర్‌గాళ్లు కూడా ఉంటారు మరీ తస్మాత్ జాగ్రత్త..! చోరీ వీడియో వైరల్‌!!
Theft Video
Follow us
Jyothi Gadda

|

Updated on: May 25, 2022 | 9:10 PM

ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్, వైరల్‌ న్యూస్‌కి కొదవే లేకుండా పోయింది. ఇంటర్నెట్ ఆన్ చేస్తే చాలు ఫన్నీ వీడియోస్ తెగ కనిపించేస్తుంటాయి.. ఇలా సరదాగా ఉండే వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతాయి. కొన్ని కావాలనే షూట్ చేస్తారో.. లేక అవి జరుగుతున్నప్పుడు పొరపాటున షూట్ అయ్యి ఉంటాయో తెలియదు కానీ.. మొత్తానికి ఇవి నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా దొంగతనానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో పాతదే అయినప్పటికీ, ఫన్నీగా ఉన్న ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేస్తూ మరోమారు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.

వీడియోలో ఓ ఆటో ట్రాలీ నిండా సామానుతో వెళ్తోంది. ఆ ఆటో ట్రాలీ వెనకాలే, ఓ యువకుడు వేలాడుతూ కనిపిస్తుంటాడు..ఆ ట్రాలీలో ఉన్న వస్తువులను అతడు మెల్లిగా చోరీ చేస్తూ…తన వెనకాలే బైక్‌పై వస్తున్న మరో వ్యక్తికి అందిస్తున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పటికీ చుట్టు పక్కల వాహనదారులు, ప్రయాణికులు ఎవరూ పట్టించుకున్న పాపపోలేదు. ఎవరి మానాన వారు అదేమీ పట్టనట్లే ముందుకు వెళ్తున్నారు. వెనుక నుంచి కారులో వస్తున్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by abcd (@swami_7773)

వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.