Viral Video: బాబోయ్.. ఇదేం బాదుడు.. భర్తను పిచ్చికొట్టుడు కొట్టిన భార్య.. వీడియో వైరల్

సార్... నా భార్య కొడుతోంది.. ఆమె కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నా, ప్లీజ్ మీరే కాపాడాలి అంటూ... ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మొర పెట్టుకున్నాడు. ఇలాంటి హృదయ విదారకమైన సంఘటన

Viral Video: బాబోయ్.. ఇదేం బాదుడు.. భర్తను పిచ్చికొట్టుడు కొట్టిన భార్య.. వీడియో వైరల్
Wife Beats
Follow us
Jyothi Gadda

| Edited By: Ram Naramaneni

Updated on: May 26, 2022 | 3:34 PM

సార్… నా భార్య కొడుతోంది.. ఆమె కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నా, ప్లీజ్ మీరే కాపాడాలి అంటూ… ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మొర పెట్టుకున్నాడు. ఇలాంటి హృదయ విదారకమైన సంఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడిలో చోటు చేసుకుంది.. ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తన భార్య తనను చిత్రహింసలకు గురిచేస్తోందంటూ పోలీసులను ఆశ్రయించాడు. భార్య పెడుతున్న చిత్రహింసలు సాక్ష్యాదారాలతో సహా పోలీసులకు సమర్పించాడు. తనను ఎలాగైన మీరే కాపాడాలి సార్‌ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

బాధిత ప్రిన్సిపల్‌ అజిత్ సింగ్ యాదవ్, సోనిపట్ ప్రాంతానికి చెందిన సుమన్‌ ను 7 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది..ఆ తర్వాతే మొదలైంది. అతని భార్య గయ్యాలితనం..పెళ్లిచేసుకునే కొద్ది రోజులకే ఆమె అతడిపై టార్చర్ మొదలుపెట్టిందంటూ పోలీసుల ఎదుట అజిత్‌ సింగ్‌ ఆవేదన వెలబుచ్చాడు. భార్య తనను చిత్రహింహలు పెడుతున్న దృశ్యాలను నమోదు చేసేందుకు సదరు బాధిత ప్రిన్సిపల్ ఆధారాలు ఇంట్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. సీసీ ఫుటేజ్‌ విజువల్‌ తో తన భార్య బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తోందందూ రక్షణ కోసం కోర్టును ఆశ్రయించాడు ప్రిన్సిపల్‌. కాగా, ప్రిన్సిపల్‌ సేకరించిన సీసీ ఫుటేజ్‌ విజువల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ వీడియోలో ఆ మహిళ తన భర్తని క్రికెట్ బ్యాట్‌తో కొడుతుండగా, వారి కొడుకు పక్కనే ఉండి చూస్తూ ఉండిపోయాడు తప్ప..ఏమీ చేయలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

తన భార్య రొట్టేల పిటా, కర్ర, క్రికెట్ బ్యాట్‌ ఇలా ఎది దొరికితే దాంతో దాడి చేస్తోందని ప్రిన్సిపాల్ పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కోర్టు సైతం… ఆయనకు భద్రత కల్పించాలని ఆదేశించింది.