AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seagull: ఆమె పిజ్జా తింటుంటే షాక్… పక్షులు ఇలా కూడా చేస్తాయా ? అక్కడివారికి చుక్కలు చూపిస్తున్నాయ్‌..

ఓ సీగల్‌ పక్షి ఏకంగా ఓ సూపర్‌ మార్కెట్లో చిప్స్‌ చోరీ చేసిన ఘటన నిన్నమొన్నటి వరకు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఇక తాజాగా మరో పక్షి ఏం చేసిందో తెలిస్తే

Seagull: ఆమె పిజ్జా తింటుంటే షాక్... పక్షులు ఇలా కూడా చేస్తాయా ? అక్కడివారికి చుక్కలు చూపిస్తున్నాయ్‌..
Seagull Flying
Jyothi Gadda
|

Updated on: May 25, 2022 | 6:22 PM

Share

సీగల్ అనే పక్షి ( Seagull ) ఎక్కువగా సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇవి బీచ్‌లో సరదాగా కాలక్షేపం చేయడానికి వచ్చిన వారి దగ్గర ఉండే చిరుతిండిని దొంగిలించడం వీటికి బాగా అలవాటు. అలా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో వీటికి మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఓ సీగల్‌ పక్షి ఏకంగా ఓ సూపర్‌ మార్కెట్లో చిప్స్‌ చోరీ చేసిన ఘటన నిన్నమొన్నటి వరకు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఇక తాజాగా మరో పక్షి ఏం చేసిందో తెలిస్తే మీరు కూడా షాక్‌ అవుతారు. ఓర్నీ పక్షులు ఇలా కూడా చేస్తాయా..? అని ముక్కున వేలేసుకుంటారు..ఇంతకీ ఇక్కడ పక్షి ఏం చేసిందంటే..

అసలు..సీగల్ అనే పక్షి ( Seagull )అనేవి మనకు పావురాలు ఎలాగో..వీదేశీయులకు సీగల్‌ పక్షులు అలాగన్నమాట…ఇవి ఎక్కువగా సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఐతే ఈ వీడియోలో ఓ సీగల్‌ పక్షి చిరుతిండిని దొంగిలించడానికి ఇంకా కొంచం మాస్టర్ ప్లానే వేసింది. ఓ మహిళ దగ్గర పిజ్జాను ఎత్తుకుపోయింది ఓ సీగల్ పక్షి. టేబుల్‌ పెట్టుకున్న పిజ్జాను నోటకరుచుకుని అతివేగంతో పరుగుతీసి తుర్రుమంది. ఆ పక్షికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ మహిళ పిజ్జా ఆర్డర్‌ పెట్టుకుంది. డెలివరీ బాయ్‌ ఇంటికి పార్శీల్‌ తెచ్చాడు. బాక్స్ డెలివరీ అయ్యింది. దాన్ని టేబుల్‌పై తెరచి ఉంచిన ఆ మహిళ అంతలోనే ఏదో పనిమీద ఇంట్లోకి వెళ్లింది. వెంటనే తిరిగి వచ్చింది. పిజ్జా బాక్స్ అలాగే ఉంది. కానీ, అందులో పిజ్జా మాత్రం లేదు. “అదేంటి ఇంతకుముందే కదా..నేను పిజ్జా బాక్స్‌ ఓపెన్‌ చేసింది…ఇంతలోకే పిజ్జా ఏమైపోయింది అనుకున్న ఆమె చుట్టూ చూసింది..కానీ, అక్కడ ఎవరూ కనిపించలేదు..అంతలోనే పైకి చూస్తే….. ఆకాశంలో సీగల్ పక్షి దాన్ని ఎత్తుకుపోతూ కనిపించింది. ఇక దాంతో గుడ్లు మిటకరించి చూస్తూ…ఆశ్చర్యపోవడం సదరు మహిళ వంతైంది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్