PM Modi: ప్రపంచమే మన వెనక ఉండాల్సిందే.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మోదీ ఫోటో..

ఈ ఫోటోను ట్విట్టర్‌లో పిక్చర్ ఆఫ్ ది డేగా ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ప్రధాని నరేంద్ర మోడీ, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్, ఆస్ట్రేలియా కొత్తగా నియమితులైన ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో..

PM Modi: ప్రపంచమే మన వెనక ఉండాల్సిందే.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మోదీ ఫోటో..
Pm Modi
Follow us

|

Updated on: May 25, 2022 | 7:15 PM

జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన క్వాడ్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం చివరి రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీతోపాటు(PM Modi) అన్ని దేశాల నాయకుల ఫోటో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ట్విట్టర్‌లో పిక్చర్ ఆఫ్ ది డేగా ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ప్రధాని నరేంద్ర మోడీ, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్, ఆస్ట్రేలియా కొత్తగా నియమితులైన ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కలిసి మెట్లు దిగడం చూడవచ్చు. ఈ ఫోటోలో ప్రధాని మోదీ ఈ నేతలకు నాయకత్వం వహిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఈ నాయకులందరూ టోక్యోలో క్వాడ్ సమావేశానికి తరలివచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ఫోటో దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. యూజర్లు దీన్ని #pictureoftheday అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోలో జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి మెట్లు దిగుతున్న ప్రధాని నరేంద్ర మోడీని చూడవచ్చు.

ఈ ఫోటోను మెచ్చుకుంటూ పలువురు బీజేపీ నేతలు, ఇతర సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. అనే క్యాప్షన్‌తో కూడిన ఫోటోను బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ట్విట్టర్‌లో ఫోటోను పోస్ట్ చేస్తూ, అతను క్యాప్షన్ ఇలా రాశారు.” ప్రపంచాన్ని నడిపించే ఈ ఫోటో వెయ్యి పదాల విలువైనది” అంటూ పేర్కొన్నారు.

అయితే, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి ప్రపంచ గురువు ఇండియా అని రాశారు. అలాగే, బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ.. “దారి తెలిసిన, మార్గం చూపే, దారి చూపే ప్రధాన సేవకుడు” అంటూ పోస్ట్ చేశారు.

ఇది కాకుండా, బిజెపి నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఈ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు” గ్లోబల్ లీడర్” అనే క్యాప్షన్‌లో రాశారు.

అంతేకాదు అన్ని సోషల్ మీడియా వేదికలపై ఇలా పోస్ట్ చేస్తున్నారు. “ఈ రకంగా దేశ స్వతంత్రం వచ్చిన కానుంచి ఎప్పుడైనా ప్రధానమంత్రిని ఈ రకంగా చూశారా.. విశ్వ నాయకుడిగా నడిపిస్తున్నారు.. అగ్రదేశాల వెనకాల నడవట్లేదు.. అగ్ర దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారు ప్రధాని మోడీ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Latest Articles