Chittoor: శాడిస్టు మొగుడు..! 11 నెలల బిడ్డను, తల్లిని విడదీసి చిత్రహింసలు..బాధితురాలి గోడు..

ఓ శాడిస్టు భర్త 11 నెలల బిడ్డను తల్లి కి దూరం చేసాడు. భార్యను కొట్టి బిడ్డను లాక్కెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నిడిగుంట లో జరిగింది. భర్తకు తోడుగా..

Chittoor: శాడిస్టు మొగుడు..! 11 నెలల బిడ్డను, తల్లిని విడదీసి చిత్రహింసలు..బాధితురాలి గోడు..
Sadist Husband
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: May 26, 2022 | 1:17 PM

ఓ శాడిస్టు భర్త 11 నెలల బిడ్డను తల్లి కి దూరం చేసాడు. భార్యను కొట్టి బిడ్డను లాక్కెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నిడిగుంట లో జరిగింది. భర్తకు తోడుగా కన్న తల్లి కూడ హింసించిందని శాడిస్ట్ భర్తతో కాపురం చేయలేనని బిడ్డను తనకు అప్పగించాలని బాధితురాలు అశ్వని వేడుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బాధితురాలు చిత్తూరులో మీడియా ముందు తన ఆవేదనను వెల్లబుచ్చింది.పెద్దపంజాణి మండలం నిడిగుంటకు చెందిన అశ్వినికి రెండేళ్ల క్రితం వివాహమైంది. తనకంటే 20 ఏళ్ళు వయస్సులో పెద్దవాడైన కోదండతో రెండవ భార్య గా పెద్దలు బలవంతపు పెళ్లి చేశారు. అశ్వని భర్త కోదండ రామకుప్పంలో ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తున్నాడు. తన భర్త 11 నెలల బిడ్డను లాక్కొని తనను కొట్టి తరిమేశాడని అశ్వని ఆరోపిస్తుంది. తన తల్లి, గ్రామ సర్పంచ్ కూడా శాడిస్ట్ భర్త తోనే కాపురం చేయాలని ఒత్తిడి చేస్తున్నారంటూ అశ్విని కన్నీటి పర్యంతమైంది. శనివారం అర్ధరాత్రి నీడి గుంట గ్రామంలో తీవ్రంగా కొట్టి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేసింది. తన బిడ్డ పాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాడని, పాలు ఇవ్వలేక పోవటం తో తను కూడా అనారోగ్యానికి గురయ్యానని అశ్వని బోరున విలపించింది. బిడ్డను అప్పగించి భర్త నుంచి రక్షణ కల్పించాలని బాధితురాలు అశ్విని వేడుకుంది. కాగా అశ్విని ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే బిడ్డను తెచ్చుకున్నానని భర్త కోదండ చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి