Telangana: ‘శివలింగమైతే మాది.. శవమైతే మీది’.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..!

Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణను ఒక్కసారిగా షేక్ చేశాయి.

Telangana: ‘శివలింగమైతే మాది.. శవమైతే మీది’.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..!
Bandi Sanjay
Follow us
Shiva Prajapati

|

Updated on: May 25, 2022 | 8:42 PM

Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణను ఒక్కసారిగా షేక్ చేశాయి. ఇప్పటి వరకు ఉత్తరాదినే ఉన్న మసీద్-మందిర్ వివాదం.. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలోనూ వ్యాప్తిచెందినట్లు అయ్యింది. ఇవాళ హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ప్రసంగించిన బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న మసీదులన్నీ తవ్వాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారాయన. అంతటితో ఆగకుండా.. ‘మసీదులను తవ్వితే శివలింగం వస్తే మాది.. శవమైతే మీరు తీసుకోండి’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

బుధవారం నాడు కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. జ్ఞానవాపి మసీదు వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. జ్ఞానవాపిలోని మసీదులో తవ్వకాలు జరిపితే శివలింగం బయల్పడిందని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులను తవ్వాలని అన్నారు. దేశంలో ఏ మసీదు తవ్వినా.. హిందూ దేవాలయాల ఆనవాళ్లు బయటపడుతున్నాయన్న సంజయ్‌.. తెలంగాణలోనూ అన్ని మసీదుల్లో తవ్వకాలు జరపాలని డిమాండ్‌ చేశారు. అక్కడ శివలింగాలు బయల్పడితే తమకు ఇచ్చేయాలని.. శవాలు బయటపడితే మీరు తీసుకోవాలంటూ ప్రత్యర్థులకు సవాల్‌ విసిరారు సంజయ్‌.

అంతేకాదు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను మూసివేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని అన్నారు. తెలంగాణకు పట్టిన శనిని వదిలించి.. రాజరాజ్యం స్థాపించి తీరుతామని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బండి సంజయ్ ఎమోషనల్ అయ్యారు. ‘ఢిల్లీకి రాజైనా తల్లికొడుకేనన్నట్లుగా.. కరీంనగర్‌ ప్రజలకు తన చివర రక్తపు బొట్టు వరకు రుణపడి ఉంటాను’ అని అన్నారు బండి సంజయ్. తనను పార్లమెంటుకు పంపినందుకు.. నియోజకవర్గ ప్రజలను తలెత్తుకునేలా చేస్తానని అన్నారాయన.

ఇవి కూడా చదవండి