Telangana: బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి.. ఎమ్మెల్యే రఘనందన్ రావు
ప్రధాని మోడీ(PM Modi) అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా దుబ్బాకలో(Dubbaka) ఎమ్మెల్యే రఘనందన్ రావు సమావేశం నిర్వహించారు. జూన్ ఒకటి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.....
ప్రధాని మోడీ(PM Modi) అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా దుబ్బాకలో(Dubbaka) ఎమ్మెల్యే రఘనందన్ రావు సమావేశం నిర్వహించారు. జూన్ ఒకటి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు మోడీ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక 18వేల గ్రామపంచాయతీలకు కరెంటు అందించామన్న రఘు నందన్(MLA Raghu Nandan Rao).. దళితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. అవినీతి రహిత పాలన కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్- ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో రేపు మధ్యాహ్నం 1:25 గం.లకు మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరకుంటారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు రాష్ట్ర అధికారులు, బీజేపీ నాయకులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.
ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐఎస్‌బీకి 5 కిలోమీటర్ల పరిధిలో రిమోట్ కంట్రోల్ డ్రోన్ల వాడకంపై నిషేధం విధించారు. ప్యారాగ్లైడింగ్, మైక్రో లైట్ ఎయిర్ క్రాప్ట్స్‌పై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క ఐఎస్‌బీలోనే సుమారు 2 వేల మందితో బందోబస్తు చేపడుతున్నారు. ఈ ఆంక్షలు రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు అమల్లో ఉండనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి