కోనసీమలో మళ్లీ టెన్షన్ టెన్షన్.. రావులపాలెంలో ఉద్రిక్తత
కోనసీమ జిల్లా పేరను మార్పును నిరసిస్తూ చేస్తున్న ఆందోళనలు చల్లారడం లేదు. నిన్న అమలాపురం ఘటనను మరవకముందే రావులపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి ...
కోనసీమ జిల్లా పేరను మార్పును నిరసిస్తూ చేస్తున్న ఆందోళనలు చల్లారడం లేదు. నిన్న అమలాపురం ఘటనను మరవకముందే రావులపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న రావులపాలెంలో కొద్దిసేపటి క్రితమే ఆందోళనలు మొదలయ్యాయి. పట్టణంలోని కళా వెంకట్రావు బొమ్మ వద్ద నిరసనకారులు ఆందోళన తెలుపుతూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. జిల్లా సాధన సమితి ఛలో రావులపాలెం పిలుపుతో నిరసనకారులు రోడ్లపైకి వస్తున్నారు. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అటు ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డిని అడ్డుకుని జై కోనసీమ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు వెంబడించారు. ఈ ఘటనలో ఎస్పీ వాహనం పూర్తిగా దెబ్బతింది. కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ కోనసీమ సాధన సమితి నేడు చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిన్న అమలాపురంలో చోటుచేసుకన్న హింసాత్మక ఘటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అమలాపురం మాదిరి పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించారు. రోడ్లపైకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
సాధన సమితి పిలుపు మేరకు రావులపాలెంలో కొందరు యువకులు రోడ్లపైకి వచ్చారు. అనుమానస్పదంగా తిరుగుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌లు, ఆటోల్లో వస్తున్న యువకులపై పోలీసులు నిఘా పెట్టారు. ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి ఘటనతో పోలీసులు మరింతగా అప్రమత్తం అయ్యారు. కొన్ని చోట్ల యువకులు దాగి ఉండొచ్చని.. ఆందోళనకు దిగొచ్చని భావించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం రావులపాలెంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి