SCR: సాధారణ రైళ్లు నడుస్తున్నాయ్ సరే.. మరి రాయితీల మాటేమిటి.. రైల్వే తీరుతో అయోమయం

కరోనా లాక్ డౌన్ కారణంగా గతంలో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. అయితే కరోనా తీవ్రత తగ్గడం, రాష్ట్రాలు ఆంక్షలు సడలించడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో రైళ్లు ఒక్కొక్కటిగా పట్టాలెక్కాయి. అయితే ఇప్పటికీ...

SCR: సాధారణ రైళ్లు నడుస్తున్నాయ్ సరే.. మరి రాయితీల మాటేమిటి.. రైల్వే తీరుతో అయోమయం
Trains
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 25, 2022 | 4:11 PM

కరోనా లాక్ డౌన్ కారణంగా గతంలో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. అయితే కరోనా తీవ్రత తగ్గడం, రాష్ట్రాలు ఆంక్షలు సడలించడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో రైళ్లు ఒక్కొక్కటిగా పట్టాలెక్కాయి. అయితే ఇప్పటికీ పలు వర్గాల వారికి రాయితీలను పునరుద్ధరించలేదు. ప్రస్తుతం కేవలం 14 వర్గాల వారికి మాత్రమే సబ్సిడీలను కొనసాగిస్తోంది. కరోనా పేరతో ప్రత్యేక రైళ్లంటూ దాదాపు ఏడాదిపాటు 30 శాతం అదనంగా ఛార్జీలను వసూలు చేయడమే కాకుండా 64 రకాల రాయితీలకు రైల్వే ఎగ్గొట్టింది. ప్రయాణికుల నుంచి విమర్శలు రావడంతో ఎట్టకేలకు 14 రకాల రాయితీలను మాత్రమే అనుమతించింది. అయితే అన్నీ సాధారణ రైళ్లు అయినప్పుడు రాయితీల విషయంలో ఎందుకు కోత విధిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, రక్తహీనత, క్యాన్సర్‌, గుండె సంబంధిత, జన్యుపరమైన వ్యాధులు, హిమోఫిలియా, కిడ్నీ, కుష్ఠు, టీబీ, తలసేమియా, విద్యార్థులు, అంధులు, చెవిటి, మూగ, మానసిక రోగులకు మాత్రమే రైల్వే రాయితీలను ఇస్తోంది.

మరోవైపు.. అన్ని రకాల రాయితీలను ఎత్తివేసిన రైల్వే వయోవృద్ధులపై చిన్నచూపు చూస్తోంది. 60 ఏళ్లు నిండిన పురుషులు, 58 ఏళ్లు పూర్తయిన మహిళలకు గతంలో 50 శాతం రాయితీ ఇచ్చేది. కరోనా తర్వాత ఈ రాయితీని రద్దు చేసింది. సాధారణ రైళ్లు నడుపుతూ ఆరు నెలలు దాటినా ఈ రాయితీలను పునరుద్ధరించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి