AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పతకం గెలిచాక తొలిసారి రాష్ట్రానికి రానున్న నిఖత్.. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు

తెలంగాణ ఆణిముత్యం నిఖత్ జరీన్(Nikhat Zareen).. ప్రపంచ బాక్సింగ్ విజేతగా గెలుపొంది తొలిసారిగా ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఘన స్వాగతం పలకాలని....

Telangana: పతకం గెలిచాక తొలిసారి రాష్ట్రానికి రానున్న నిఖత్.. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
Nikhat Zareen
Ganesh Mudavath
|

Updated on: May 25, 2022 | 5:23 PM

Share

తెలంగాణ ఆణిముత్యం నిఖత్ జరీన్(Nikhat Zareen).. ప్రపంచ బాక్సింగ్ విజేతగా గెలుపొంది తొలిసారిగా ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఘన స్వాగతం పలకాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు. ఈ మేరకు రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయాకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 కేజీల విభాగంలో మన రాష్ట్రానికి చెందిన దేశం గర్వించదగ్గ యువ బాక్సర్ నిఖత్ జరీన్ అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన బాక్సింగ్ ఆణిముత్యం నిఖత్ జరీన్ కు, అలాగే సికింద్రాబాద్(Secunderabad) కు చెందిన ఇషా సింగ్ జర్మనీ లోని సూల్ నగరం లో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్స్ సాధించి అదే రోజు రాష్ట్రానికి వస్తున్నారు. ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిని నింపేలా ఘన స్వాగతం పలకాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నిర్వహిస్తున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో దేశ యువ బాక్సర్ నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర లిఖించింది. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఫైనల్స్‌లో గెలిచి తెలుగు నేల సత్తా చాటింది. థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్‌పై ఘన విజయం సాధించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 52 కేజీల ఫైనల్లో భారత బాక్సర్ జరీన్ 5-0తో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్ జిట్‌పాంగ్‌ను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. నిఖత్.. MC మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ RL, లేఖ సితో కలిసి ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి