AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Fear: అమ్మో పులి.. ఆ ప్రాంతంలోనే తిష్ట వేసింది.. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు వాసులూ అలర్ట్..

Tiger: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో మ్యాన్‌ఈటర్‌ టైగర్‌ టెర్రర్‌ కొనసాగుతోంది. మనుషులతో పాటు పశువుల మందలపై విరుచుకుపడుతున్న పులి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Tiger Fear: అమ్మో పులి.. ఆ ప్రాంతంలోనే తిష్ట వేసింది.. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు వాసులూ అలర్ట్..
Tiger
Shiva Prajapati
|

Updated on: Dec 04, 2022 | 8:58 PM

Share

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో మ్యాన్‌ఈటర్‌ టైగర్‌ టెర్రర్‌ కొనసాగుతోంది. మనుషులతో పాటు పశువుల మందలపై విరుచుకుపడుతున్న పులి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు వెళ్లిన పులి తిరిగి తెలంగాణ లోకి వచ్చే అవకాశముందని సరిహద్దు గ్రామాల్లో అలర్ట్‌ జారీ చేశారు.

బెబ్బులి దడ పుట్టిస్తోంది. తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్‌లో మ్యాన్‌ఈటర్‌ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కనిపించిన పశువులు, మనుషులపై పంజా విసురుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌జిల్లా తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పెద్దపులి తిష్టవేసినట్టు ఫారెస్ట్‌ శాఖ అధికారులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లిన జంగు అనే వ్యక్తి పీక కొరికి చంపేసింది. పులి పంజా దెబ్బకు శరీరం నుంచి తల వేరు అయింది. మనుషులనే కాదు తమ జాతికి చెందిన పులులపై కూడా ఈ మ్యాన్‌ ఈటర్‌ దాడి చేస్తోంది.

తోటి పులులపైనా దాడి..

ఈ మ్యాన్ ఈటర్ మనుషులనే కాదు.. తమ జాతికి చెందిన పులులపై కూడా దాడి చేస్తోంది. షేయోని ఫారెస్ట్ రేంజ్‌లో ఓ తల్లి పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని 3 రోజలు కూడా కాకముందే మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని తాడోబ టైగర్ రిజర్వు పారెస్ట్‌లో నాలుగు పులి పిల్లలు చనిపోయి కనిపించాయి. మరణించిన పులి పిల్లల వయసు 3-4 ఏళ్ల మధ్య ఉందన్నారు ఫారెస్టు ఆఫీసర్స్‌. తల్లి పులి కళేబరం కనిపించిన ప్రాంతంలోనే ఇవి కూడా కనిపించినట్టు తాడోబా-అంధారి టైగర్ రిజర్వు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చనిపోయిన పులి పిల్లల్లో రెండు మగవి కాగా, మిగతా రెండు ఆడవి. చనిపోయిన నాలుగు పులి పిల్లలపై కొరికిన గాయాలు ఉన్నాయని, దీనిని బట్టి చూస్తే ఆ మగ పులే వాటిని చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. పులి పిల్లల కళేబరాలను పోస్టుమార్టం కోసం చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కి తరలించారు.

వారం రోజుల్లో ఆరు పులులు, ఓ వ్యక్తి మృతి..

తాడోబ ఫారెస్టులో టెరిటోరియల్‌ ఫైట్‌ నడుస్తోంది. పశువులు, మనుషులపై దాడితో లక్కాడికోట్‌, వాంకిడి ప్రజలు వణికిపోతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఆరు పులులు, ఓ వ్యక్తిని పొట్టన పెట్టుకున్న మ్యాన్‌ఈటర్‌ను పట్టుకునేందుకు ఫారెస్టు సిబ్బంది ట్రాప్‌ కెమెరాలు, టైగర్‌ ట్రాకర్లతో పులివేట కొనసాగుతోంది. అయితే మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాలో ఉన్న కవ్వాల్‌ అటవీప్రాంతంలోకి మ్యాన్‌ఈటర్‌ ఎంటరయ్యే అవకాశం అవకాశం ఉంది.

కొమురంభీంజిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌లో గతనెల 14న గిరిజన రైతు సిడాం భీంపై మ్యాన్‌ ఈటర్‌ దాడి చేసింది. అయితే తాజాగా లక్కాడికోట్‌లో పశువులకాపరి జంగుపై దాడి చేసింది కూడా ఒకేపులి అని ఫారెస్టు సిబ్బంది గుర్తించారు. ఈ రెండు పులులు ఒక్కటేనని ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. దాంతో చంద్రపూర్ జిల్లా – కొమురంభీం జిల్లాల సరిహద్దు గ్రామాలను అలర్ట్ చేశారు ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్