AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Video: గాండ్రిస్తున్న పెద్దపులి ఎదురుపడితే ఇలానే ఉంటుంది.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..

పెద్దపులి.. తలుచుకుంటేనే భయం పుడుతుంది ఎవరికైనా. అసలా పేరులోనే ఉంటుంది భయం పుట్టించే వైల్డ్‌ సౌండింగ్‌. పెద్దపులి ఎదురుపడితే దాని పంజా నుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యంకాదు. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది దాని పంజా..

Tiger Video: గాండ్రిస్తున్న పెద్దపులి ఎదురుపడితే ఇలానే ఉంటుంది.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
Tiger Video
Shaik Madar Saheb
|

Updated on: May 27, 2023 | 1:54 PM

Share

పెద్దపులి.. తలుచుకుంటేనే భయం పుడుతుంది ఎవరికైనా. అసలా పేరులోనే ఉంటుంది భయం పుట్టించే వైల్డ్‌ సౌండింగ్‌. పెద్దపులి ఎదురుపడితే దాని పంజా నుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యంకాదు. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది దాని పంజా. అసలు, పెద్దపులి గాండ్రింపు చాలు మన గుండెలదిరిపోవడానికి. అదే, డైరెక్ట్‌గా పెద్దపులి ఎదురుపడితే.. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి!.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో అదే జరిగింది మరి. గాండ్రిస్తూ రోడ్డు దాటుతోన్న పెద్దపులిని చూసి హడలిపోయారు జనం. కొన్ని నిమిషాలపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పెద్దపులి రోడ్డు దాటుకొని అడవిలోకి వెళ్లేవరకూ ఊపిరి బిగపట్టుకొని ఉన్నచోటే నిలబడ్డారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని తడోబా రిజర్వు ఫారెస్ట్‌ ఏరియాలో జరిగిందీ ఇన్సిడెంట్‌. రోడ్డు దాటుతోన్న పెద్దపులిని గమనించి ఎక్కడకక్కడ ఆగిపోయారు వాహనదారులు. పులి పూర్తిగా అడవిలోకి వెళ్లేవరకూ సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే, ఎక్కడ తమపైకి వస్తుందో… పంజా విసురుతుందోనని హడలిపోయారు జనం. పులి మాత్రం అటూఇటూ చూడకుండా తన మానాన అది నడుచుకుంటూ అడవిలోకి వెళ్లిపోయింది. దాంతో, ఊపిరి పీల్చుకున్నారు వాహనదారులు.

వీడియో చూడండి..

పెద్దపులి రోడ్డు దాటుతోన్న దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు జనం. ఆ దృశ్యాలను ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది టీవీ9. ఆ దృశ్యాలనే మీరు ఇప్పుడు టీవీ9 వీడియోలో చూడవచ్చు. పెద్దపులి సంచారంతో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు అటవీ అధికారులు. పరిసర గ్రామాలను, వాహనదారులను అలర్ట్‌ చేశారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు