AP-Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా టికెట్ల కొత్త రేట్లు ఇవే.. పూర్తి వివరాలు మీ కోసం
ప్లేస్ ఏదైనా జనాలకు సినిమా అంటే వినోదం.. కానీ ఏపీలో ఇప్పుడది వివాదంగా మారిపోయింది. సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుండటం.. దుమారానికి కారణమవుతోంది.

ప్లేస్ ఏదైనా జనాలకు సినిమా అంటే వినోదం.. కానీ ఏపీలో ఇప్పుడది వివాదంగా మారిపోయింది. సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుండటం.. దుమారానికి కారణమవుతోంది. అందుకు పూర్తి భిన్నంగా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ధరలు తగ్గించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం చెబుతుంటే… రేట్లు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.
ఏపీలో సినిమా టికెట్ ధరల లిస్ట్ ఇదే
మున్సిపల్ కార్పొరేషన్లు….. మల్టీప్లెక్సు: ప్రీమియం రూ.250, డీలక్స్: రూ.150, ఎకానమీ: రూ.75 ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40 నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20
మున్సిపాలిటీలు:……. మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60 ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30 నాన్ ఏసీ: ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15
నగర పంచాయతీలు:……. మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40 ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15 నాన్ ఏసీ: ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
గ్రామ పంచాయతీలు:….. మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30 ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10 నాన్ ఏసీ: ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5 —————————————
తెలంగాణలో టిక్కెట్ల ధరలు జీవో నెంబర్ 21 విడుదల
నాన్ ఏసీ ధియేటర్లలో కనీస టిక్కెట్ ధర రూ.30, గరిష్ఠ ధర రూ.70 ఏసీ ధియేటర్లల్లో కనీస ధర రూ.50, గరిష్ఠ ధర రూ.150 మల్టీప్లెక్స్ లో కనీస ధర రూ.100, గరిష్ఠ ధర రూ.250 మల్టీప్లెక్స్ రిక్లైనర్ సీట్లకు గరిష్ఠంగా రూ.300 (జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం)
Also Read: Telangana: టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ వరాలు.. ఏపీలో మాత్రం అదే వార్
