AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter First Year Result: అందరు పాస్.. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై కీలక ప్రకటన..

ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు...

Inter First Year Result: అందరు పాస్.. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై కీలక ప్రకటన..
Inter
Srinivas Chekkilla
|

Updated on: Dec 24, 2021 | 6:51 PM

Share

ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరు పాస్ అయినట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అందరిని కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లు వెల్లడించారు.

కరోనా విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. దాన్ని అధిగమించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసిందని వివరించారు. డిజిటల్, టి షాట్ ద్వారా క్లాసులు నిర్వహించే ప్రయత్నం చేశామన్నారు. 9 పరీక్షలు రాయాల్సిన స్టూడెంట్స్‎ని 10thకి ప్రమోట్ చేశామని టెన్త్ వారిని ఇంటర్ ప్రమోట్ చేశామని.. ఇంటర్ సెకండ్ ఇయర్ వారిని కూడా ప్రమోట్ చేశామని గుర్తు చేశారు.

రాష్ట్రంలో 900పైగా గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. 620 గురుకులాలను ఇంటర్‎కు అప్‎గ్రేడ్ చేశామన్నారు. ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానెల్‎ను 3 లక్షల పైగా పిల్లలు సబ్‎స్ర్కైబ్ చేసుకొని చూశారని సబితా తెలిపారు. సెకండ్ ఇయర్ వెళ్లే ముందు1st ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలని నిర్ణయించమన్నారు. ఎన్నో ఆలోచించి నెల రోజుల టైం ఇచ్చి పరీక్షలు పెట్టామన్నారు. ఈ పరీక్షల్లో 49 శాతం మంది పాస్ అయ్యారని చెప్పారు.

ఫెయిల్ అయిన వాళ్లందరూ వచ్చి బోర్డు, ప్రభుత్వం ఎదో తప్పు చేసినట్లు మాట్లాడటం బాధాకరమని సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఇంటర్ బోర్డు ఎక్కడ మిస్టేక్ చేయలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు కూడా పిల్లల కెరీర్ విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పిల్లలు బాగా చదువుకోవడానికి మోటివేట్ చేయాలన్నారు. 10 మార్కులు కలిపితే 8,070 మంది ఉత్తీర్ణులవుతారని 25 మార్కులు కలిపితే 70 వేల మంది పాసవుతారని పేర్కొన్నారు. ఈ ఫలితాల ప్రభావం సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‎పై పడొద్దని ఈ నిర్ణయం తీసుకున్నాట్లు సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో ఇలా చేయడం కుదరదని.. అందరు కష్టపడి చదవాలని కోరారు.

Read Also.. AP-Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా టికెట్ల కొత్త రేట్లు ఇవే.. పూర్తి వివరాలు మీ కోసం

Follow Us
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు