విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

విద్యుదాఘాతంతో ముగురు రైతులు ఒక్కసారే మృతిచెందిన దుర్ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్పుగొండ గ్రామ శివారులోని స్వామి గౌడ్ పంట పొలంలో చెడిపోయిన బోరులోని మోటారును తీయడానికి వెళ్ళిన ముగ్గురు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. మృతి చెందిన వారిలో మురళీధర్ రావు(55),  ఇమ్మడి నారాయణ (40), లక్ష్మణ రావు( 60)లు ఉన్నారు. ముగ్గురు చెడిపోయిన బోరు మోటారుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో బోరు మోటారు పైపులు పైకి […]

విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి
Follow us

|

Updated on: Sep 16, 2019 | 6:36 PM

విద్యుదాఘాతంతో ముగురు రైతులు ఒక్కసారే మృతిచెందిన దుర్ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్పుగొండ గ్రామ శివారులోని స్వామి గౌడ్ పంట పొలంలో చెడిపోయిన బోరులోని మోటారును తీయడానికి వెళ్ళిన ముగ్గురు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. మృతి చెందిన వారిలో మురళీధర్ రావు(55),  ఇమ్మడి నారాయణ (40), లక్ష్మణ రావు( 60)లు ఉన్నారు. ముగ్గురు చెడిపోయిన బోరు మోటారుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో బోరు మోటారు పైపులు పైకి తీస్తుండగా, పైన విద్యుత్ వైర్లకు పైపు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పక్కపొలాల్లో ఉన్నరైతులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించిన పోలీసులు..మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకే సారి గ్రామంలోని మూడు కుటుంబాల్లో సంభవించిన అకాల మరణాలతో ఎల్పుగొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..