ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి, ఇద్దరికి సీరియస్
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. సత్తుపల్లిలో బుధవారం (డిసెంబర్ 03)తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందారు.

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. సత్తుపల్లిలో బుధవారం (డిసెంబర్ 03)తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
కారు వేంగంగా వెళ్తూ.. అదుపుతప్పి హైవేపై డివైడర్ ను ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు చంద్రుగొండ నుంచి సత్తుపల్లిలోని జరుగుతున్న శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారం దగ్గర వేగంగా ఈ ఘటన జరిగింది. మృతులను సత్తుపల్లి పట్టణం కొమ్మేపల్లి కాలనీకి చెందిన సిద్దేశీ జాయ్ (18), చంద్రుగొండకు చెందిన మర్సకట్ల శశి (12), షాదిక్ (16)గా గుర్తించారు. ఈ ఘటనలో తలారి అజయ్, ఇమ్రాన్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.
కారులో మొత్తం ఐదుగురు ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే ఐదుగురు కూడా మైనర్లు కావడంతో.. ఏమైనా మత్తులో డ్రైవింగ్ చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
