AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Rising-2047: భారత్ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌.. పొరుగు రాష్ట్రాల నుంచి సహకారం..!

వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్ స్టార్ మెస్సీ హైదరాబాద్ రాబోతున్నారు. ఆయనతో కలిసి ఫుట్‌బాల్ అడబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఆ క్రీడా వేదికపై కూడా తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రమోట్ చెయ్యబోతున్నారు. సో, గ్లోబల్ సమిట్ కోసం గ్లోబును చుట్టెయ్యాలన్నంత కమిట్‌మెంట్‌తో నడుస్తోంది రేవంత్ సర్కార్.

Telangana Rising-2047: భారత్ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌.. పొరుగు రాష్ట్రాల నుంచి సహకారం..!
Cm Revanth Reddy Team
Balaraju Goud
|

Updated on: Dec 03, 2025 | 7:10 AM

Share

వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్ స్టార్ మెస్సీ హైదరాబాద్ రాబోతున్నారు. ఆయనతో కలిసి ఫుట్‌బాల్ అడబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఆ క్రీడా వేదికపై కూడా తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రమోట్ చెయ్యబోతున్నారు. సో, గ్లోబల్ సమిట్ కోసం గ్లోబును చుట్టెయ్యాలన్నంత కమిట్‌మెంట్‌తో నడుస్తోంది రేవంత్ సర్కార్. అందుకే, దావోస్‌ బిజినెస్ ఫోరమ్‌కి ఏమాత్రం తీసిపోని రీతిలో వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ ఈవెంట్‌ రేంజ్‌లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

500 కంపెనీల నుంచి వెయ్యి మందికి పైగా గ్లోబల్ డెలిగేట్లు కొలువుదీరే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్.. ఇదొక్కటే ప్రస్తుతానికి రేవంత్ సర్కార్ ముందున్న మేజర్ టార్గెట్. ముచ్చర్లలోని భారత్ ఫ్యూచర్‌ సిటీలో మరో నాలుగైదు రోజుల్లో మొదలయ్యే గ్లోబల్ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ అంటే భవిష్యత్ భారతానికి గర్వకారణం అనేది గ్లోబల్ సమిట్ మెయిన్‌ థీమ్.

కేంద్రం నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గ్లోబల్ సమిట్‌కు సహకారం ఆశిస్తోంది తెలంగాణ సర్కార్. డిసెంబర్ 4వ తేదీన మంత్రులు స్వయంగా వెళ్లి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌, గుజరాత్‌కి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంజాబ్-హర్యానాకు దామోదర్ రాజనర్సింహ, కర్ణాటక-తమిళనాడుకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తర ప్రదేశ్‌కు పొంగులేటి, రాజస్థాన్‌కు పొన్నం ప్రభాకర్, చత్తీస్‌గడ్‌కు కొండా సురేఖ, పశ్చిమ బెంగాల్‌కి సీతక్క, మధ్యప్రదేశ్‌కి తుమ్మల నాగేశ్వరరావు, అస్సామ్‌కి జూపల్లి కృష్ణారావు, బీహార్‌కి వివేక్ వెంకటస్వామి, ఒడిషాకి వాకిటి శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్‌కి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మహారాష్ట్రకు మొహమ్మద్ అజారుద్దీన్.. వెళ్లి ఆహ్వానపత్రాలు అందజేస్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రులకు, గవర్నర్లకు తెలంగాణ ఎంపీలు ఆహ్వానం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెళతారు.

ఇప్పటికే అనేక మంది పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం వెళ్లింది. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని పిలవడానికి స్వయానా ముఖ్యమంత్రి రేవంతే ఢిల్లీలో మకాం వేశారు. ఇలా, వీలైనంత ఎక్కువమంది పొలిటికల్ ఐకాన్స్‌ని, కార్పొరేట్ దిగ్గజాల్ని రప్పించి సమ్మిట్‌ని సూపర్‌సక్సెస్ చేయాలన్నది టీ-సర్కార్ ఆలోచన. 2034 నాటికి వన్ ట్రిలియన్, 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి ఈ విజన్ డాక్యుమెంట్‌ని రోడ్ మ్యాప్‌గా భావిస్తోంది రేవంత్ ప్రభుత్వం.

ఫోర్త్‌సిటీలో గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్‌బాబు, మూడు షిఫ్టుల్లో పనిచేసి వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాలనుంచి వచ్చే ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతిని, కళా, వారసత్వ సంపదను పరిచయం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5వ తేదీ సీఎం రేవంత్‌రెడ్డి సమ్మిట్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..