Hyderabad: త్వరలో తీరనున్న భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలు.. డిసెంబర్‌లో మూడు లైన్ల ఫ్లై ఓవర్ ఓపెన్‌కు సన్నాహాలు..

Hyderabad: మినీ భారత దేశంగా పేరు గాంచిన హైదరాబాద్ నగరంలో రోజు రోజుకీ జనాభా పెరుగుతోంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన..

Hyderabad: త్వరలో తీరనున్న భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలు.. డిసెంబర్‌లో మూడు లైన్ల ఫ్లై ఓవర్ ఓపెన్‌కు సన్నాహాలు..
Hyderabad Flyovers
Follow us
Surya Kala

|

Updated on: Nov 09, 2021 | 4:55 PM

Hyderabad: మినీ భారత దేశంగా పేరు గాంచిన హైదరాబాద్ నగరంలో రోజు రోజుకీ జనాభా పెరుగుతోంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ అధ్వర్యంలో రోడ్ల అభివృద్ధికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ది కార్యక్రమం  చేపట్టింది.  ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో రవాణా ఇబ్బందులను అధిగమించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలు జిహెచ్ఎంసి చేపట్టింది.

జీహెచ్ఎంసీ పరిధిలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల వినియోగం.. దీంతో ఎక్కడిక్కడే ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ట్రాఫిక్ ను  అధిగమించి గమ్యానికి చేరడానికి చాలా ఆలస్యం అవుతుంది. అయితే ఇప్పుడు నిర్మించడానికి రెడీ అవుతున్న ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లతో ప్రయాణీకులు  అలసట లేకుండా త్వరితగతిన గమ్య స్థానం చేరేందుకు వెసులుబాటు కలుగుతుంది.  ఈ నేపథ్యంలో నగరంలో అవసరం కావాల్సిన ఫ్లై ఓవర్లు, అండర్ పాసు ల నిర్మాణాలను పలు చోట్ల కోట్లాది రూపాయలతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో మిధాని జంక్షన్ నుండి ఓవైసి ఆసుపత్రి జంక్షన్ వరకు ఓవైసీ ఆసుపత్రి జంక్షన్ వద్ద రూ. 63 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 1.40 కిలోమీటర్ల దూరం గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 12 మీటర్ల వెడల్పు, యూని డైరెక్షన్ లో మూడు లైన్ల ఫ్లై ఓవర్ డిసెంబర్ మాసం చివరి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అందుకు 38 పిల్లర్ లనిర్మాణ పనులు పూర్తయ్యాయి. 33 గిల్డర్స్ గల 132 స్పన్స్ ఫిట్ చేయడం జరిగింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి క్రింది భాగంలో బి.టి రోడ్డు పనులు పురోగతిలో ఉంది . A1 ర్యాంపు సి.అర్.సి.పి పనులు పూర్తి కాగా A2 ర్యాంపు పనులు పురోగతిలో ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న పనులు వివిధ అభివృద్ది దశలో ఉన్నందున వేగంగా పనులు పూర్తి చేసి డిసెంబర్ నెలాఖరుకి బ్రిడ్జిని ప్రారంభించాలనే లక్ష్యంతో జి హెచ్ ఎం సి అధికారులు కృషి చేస్తున్నారు. దీంతో కొత్త సంవత్సరంలో భాగ్యనగర వాసులకు చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని తెలుస్తోంది.

Also Read:  నాగార్జున సాయంతో సొంత ఇంటి కల నెరవేర్చుకున్న గంగవ్వ.. గృహప్రవేశం ఫోటోలు వైరల్..

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది