CM KCR Warangal Tour: రేపు సీఎం కేసీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన రద్దు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వరంగల్ జిల్లా పర్యటన అనూహ్యంగా రద్దయింది.
CM KCR Warangal Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వరంగల్ జిల్లా పర్యటన అనూహ్యంగా రద్దయింది. బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటిస్తారని అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. జిల్లా ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పలు అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టాలని సీఎం భావించారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి రావడంతో సీఎం పర్యటన రద్దయిందని అధికార వర్గాలు తెలిపాయి. తిరిగి ఎప్పుడు వెళతారనేది త్వరలో వెల్లడిస్తామని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం పర్యటన రద్దుతో ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు వాయిదా పడ్డాయి. కాగా, ఈనెల 29న జరగనున్న విజయగర్జన సభ సభపై సందిగ్దం ఏర్పడింది.
Read Also… Tarun Chug: త్వరలో తెలంగాణ రామరాజ్య స్థాపన.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్