AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్లోరైడ్ భూతతానికి బ‌లైన మరో ప‌ల్లెటూరు.. ముప్పై ఎళ్లు నిండ‌క‌ముందే ముసలి చాయాలు..

ఇన్నిరోజులు ప్లోరైడ్ భాదితులన్నా.. ప్లోరైడ్ సమస్యన్నా.. గుర్తోచ్చేది నల్లగోండ జిల్లా మాత్రమే.. కాని కామారెడ్డి జిల్లాలో కూడ ఓ గ్రామం ఈ ప్లోరైడ్ భూతనికి బలైంది. అవును.. నిండా ముప్పై ఎళ్లు కూడ నిండకముందే ఇక్కడి యువకుల ముఖాలపై ముసలి చాయాలు కమ్ముకుంటున్నాయి. నలబై ఎళ్లు దాటక ముందే నడుములు వంగిపోతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా ఈ మహమ్మరి భూతానికి బలైనా ఆ గ్రామాలు మిషన్ భగీరథ నీళ్ల కోసం దీనంగా వేచి చూస్తున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమారిపేట. ఈ ఊరిలో ఇప్పటి వరకు ప్లొరైడ్ భూతనికి ఎన్నో కుటుంబాలు బలై పోయాయి.

Telangana: ప్లోరైడ్ భూతతానికి బ‌లైన మరో ప‌ల్లెటూరు.. ముప్పై ఎళ్లు నిండ‌క‌ముందే ముసలి చాయాలు..
Fluoride Water
Prabhakar M
| Edited By: |

Updated on: Sep 24, 2023 | 10:48 AM

Share

ఇన్నిరోజులు ప్లోరైడ్ భాదితులన్నా.. ప్లోరైడ్ సమస్యన్నా.. గుర్తోచ్చేది నల్లగోండ జిల్లా మాత్రమే.. కాని కామారెడ్డి జిల్లాలో కూడ ఓ గ్రామం ఈ ప్లోరైడ్ భూతనికి బలైంది. అవును.. నిండా ముప్పై ఎళ్లు కూడ నిండకముందే ఇక్కడి యువకుల ముఖాలపై ముసలి చాయాలు కమ్ముకుంటున్నాయి. నలబై ఎళ్లు దాటక ముందే నడుములు వంగిపోతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా ఈ మహమ్మరి భూతానికి బలైనా ఆ గ్రామాలు మిషన్ భగీరథ నీళ్ల కోసం దీనంగా వేచి చూస్తున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమారిపేట. ఈ ఊరిలో ఇప్పటి వరకు ప్లొరైడ్ భూతనికి ఎన్నో కుటుంబాలు బలై పోయాయి. ఊరిలో ప్లోరైడ్ సమస్య ఎన్నో ఎళ్ల నుండి వీళ్లకు శాపంగా మారింది. త్రాగే నీళ్లలో ప్లోరోసిస్ ఉన్న సంగతి తెలియని వీళ్లకు ఆ నీళ్లే విషంగా మారి ఇలా తయారు చేసాయి వీళ్లను. ఈ ఊరిలో ఇలా ఎంతో మంది ఈమహమ్మరితోనే ఇబ్బందులు పడుతున్నారు.

ప‌క్కనే నిజాం సాగ‌ర్.. త్రాగ‌నీటిలో ప్లోరైడ్ భూతం..

ఈ ఊరిలో 1200 మంది జనాభ ఉన్నా దాదాపు 20 నుండి 30 కుటుంబాలు ఈ ప్లోరైడ్ మహమ్మరికి బలైయ్యాయి. పక్కనే నిజాం సాగర్ డ్యాం ఉన్నా మాకు ఎంటీ ఈ దుస్థితి అని వాపోతున్నారు. ఎళ్లుగా భాదలు పడుతున్నా కనీసం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సగం వయస్సు కూడ గడవకముందే ఇలా ముసలి చాయాలు ముఖాల పైకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్నా నిజాం సాగర్ నుండి నీళ్లు అందించడంలో గతంలో ఉన్నా ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నం చేయలేదంటున్నారు. ఇప్పుడు వచ్చే మిషన్ భగిరథ నీళ్ల కోసం వేచి చూస్తున్నాం అంటున్నారు.

ప‌ట్టించుకోని అధికారులు.. మంచం ప‌ట్టిన ప‌ల్లేలు..

ఇక వ్యాది జిల్లాలో చాల ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంది. జిల్లాలో చాలా ఆవాస ప్రాంతాల్లోని పిల్లలకు, పెద్దలకు దంతాలకు, ఎముకలకు సంబంధించిన సమస్యలు నానాటికీ పెనుభూత సమస్యలుగా మారుతున్నాయి. జిల్లాలో ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, నిజామాబాద్ నాలుగు రెవెన్యూ డివిజన్ పరిదిలో 718 గ్రామ పంచాయి తీలు ఉన్నాయి. వీటి పరిధిలో 1645 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఆవాస ప్రాంత పరిధిలో ప్రతి ఏడాది 20వేల నీటి నమూన సేకరించి పరీక్షలు జరుపవలసి ఉంది.క్షేత్రస్థాయిలో గత నాలుగై దేండ్లలో ఫ్లోరైడ్ శాతం పరిమితికి మించి పెరిగిన గ్రామాల సంఖ్య రెట్టింపు అయిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఏడాది గ్రామాల్లో పరీక్షలు నిర్వహించి ఫ్లోరైడ్ ఉన్న గ్రామాల్లో అవగాహన సదస్సుల ద్వారా తలీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుప వలిసిన అధికారులు కేవలం పరీక్షల నిర్వహణకే పరి మితమవుతున్నారని పైర్ అవుతున్నారు జిల్లా వాసులు దీనిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..