బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.