AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ కాలంలోనూ ఇలాంటి గ్రామం ఉందా! మ్యాటర్ తెలిస్తే ఆ ఊరి ప్రజలకు హ్యాట్సాఫ్ చెబుతారు..

Suryapet News: సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే. యువతను పెడదారి పట్టిస్తూ ఒళ్ళు, ఇళ్లును గుల్ల చేస్తున్న మద్యాన్ని కట్టడి చేయాలని ఇక్కడి గ్రామస్తులు నడుం బిగించారు. గ్రామంలోని బెల్ట్ షాపుల భరతం పట్టాలని సంకల్పించారు. ఇందుకోసం.. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని..

Telangana: ఈ కాలంలోనూ ఇలాంటి గ్రామం ఉందా! మ్యాటర్ తెలిస్తే ఆ ఊరి ప్రజలకు హ్యాట్సాఫ్ చెబుతారు..
Tammarabandapalem
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 21, 2023 | 8:51 PM

Share

సూర్యాపేట, జులై 21: సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే. యువతను పెడదారి పట్టిస్తూ ఒళ్ళు, ఇళ్లును గుల్ల చేస్తున్న మద్యాన్ని కట్టడి చేయాలని ఇక్కడి గ్రామస్తులు నడుం బిగించారు. గ్రామంలోని బెల్ట్ షాపుల భరతం పట్టాలని సంకల్పించారు. ఇందుకోసం.. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్తులు మద్యపానం నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి గ్రామస్తులు. ఆదర్శ గ్రామమేదో మనం కూడా తెలుసుకుందాం..

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గ్రామం తమరబండ పాలెం. 800 గ్రామ జనాభా ఉంది. ఇక్కడి వారంతా వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాలుగు దశాబ్దాల కిందట దసరా పండుగ రోజూ ఇద్దరూ వ్యక్తులు మద్యం తాగి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ కుటుంబాల మధ్య చిచ్చుకు దారితీసి గ్రామంలో అశాంతి నెలకొంది. నాటి గ్రామ పెద్దలు.. గ్రామం బాగుండాలి అంటే ఊరిలో సారా, మద్యం అమ్మకూడదు, తాగకూడదని నిర్ణయించారు. నాటి నుంచి మద్యం తాగినా, అమ్మినా జరిమానా విధించాలని గ్రామస్తులు కట్టుబాటు చేసుకున్నారు. గ్రామ కట్టుబాటును ధిక్కరిస్తే రూ. 5 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గ్రామస్తులంతా బాండ్ పేపర్ పై రాసి సంతకాలు చేశారు.

అయితే గతంలో ఓసారి ఇద్దరూ, ముగ్గురు వ్యక్తులు గ్రామ కట్టుబాటుకు వ్యతిరేకంగా బెల్ట్ షాపులను తెరిచారు. గ్రామ పెద్దలు మందలించినా.. బెల్ట్ షాపులను కొనసాగించారు. ఎవరూ మద్యాన్ని కొనకపోయేసరికి చేసేదేమి లేక వారు స్వచ్ఛందంగా బెల్ట్ షాపును మూసేశారు. ఎవరైనా మద్యం తాగాలనుకున్నా.. బంధువులు వచ్చిన.. సమీపంలోని కోదాడ పట్టణానికి వెళ్లాల్సిందే. మద్యానికి వ్యతిరేకంగా నాటి పెద్దలు విధించిన సంపూర్ణ మద్యపానం నిషేధాన్ని నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తూ ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?