Telangana: అరె.! ఎలారా ఇలా.. పోలీసులకే మస్కాకొట్టాడు.. స్కెచ్ చూస్తే దిమ్మతిరుగుద్ది

నిర్మల్ జిల్లా బైంసాలో రిమాండ్‌కు తరలిస్తున్న నిందితుడు పోలీసుల కస్టడీ నుండి పరారయ్యాడు. అరెస్ట్ అయి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులకు మస్కా కొట్టి మాయమయ్యాడు. పరారైన నిందితుడిపై గతంలోనే పీడీ యాక్ట్ నమోదవగా..

Telangana: అరె.! ఎలారా ఇలా.. పోలీసులకే మస్కాకొట్టాడు.. స్కెచ్ చూస్తే దిమ్మతిరుగుద్ది
Representative Image
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 16, 2024 | 5:16 PM

నిర్మల్ జిల్లా బైంసాలో రిమాండ్‌కు తరలిస్తున్న నిందితుడు పోలీసుల కస్టడీ నుండి పరారయ్యాడు. అరెస్ట్ అయి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులకు మస్కా కొట్టి మాయమయ్యాడు. పరారైన నిందితుడిపై గతంలోనే పీడీ యాక్ట్ నమోదవగా.. మారణాయుధాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో వలపన్ని పట్టుకున్నారు పోలీసులు. ఏఎస్పీ అవినాష్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించిన కొద్ది‌నిమిషాల్లోనే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. నిందితుడిపై గతంలో 5 కేసులు నమోదైనట్లు.. పిడి యాక్ట్ కూడా ఉందని తెలిపారు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్.

భైంసాలో పోలీసుల వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. పట్టుబడిన వ్యక్తి పాత నేరస్తుడని.. సోషల్ మీడియాలో మారణాయుధాలతో హల్చల్ చేస్తున్నట్టుగా గుర్తించారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అబ్దుల్ జుబేర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి మీడియా వివరాలు వెల్లడించి‌న పోలీసులు రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే బాత్రూం వస్తుందంటూ తెలిపిన నిందితుడిని ఎస్కార్ట్ టీం టాయిలెట్ వైపు పంపించింది. ఇదే అదునుగా భావించిన నిందితుడు ఎస్కార్ట్ సభ్యుల కళ్లుగప్పి గోడ దూకి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్కార్ట్ టీం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కస్టడీ నుండి పరారైన నిందితుడు అబ్దుల జుబేర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు‌.

నిందితుడి జుబేర్‌పై 5 కేసులున్నాయని.. గతంలోనే పిడి యాక్ట్, రౌడీ షీట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ సమయంలో నిందితుడి‌ వద్ద నుండి రెండు కత్తులు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అరె.! ఎలారా ఇలా.. పోలీసులకే మస్కాకొట్టాడు.. స్కెచ్ చూస్తే
అరె.! ఎలారా ఇలా.. పోలీసులకే మస్కాకొట్టాడు.. స్కెచ్ చూస్తే
రూ.5 లక్షల పెట్టుబడితో 15లక్షల రాబడి..ఆ పోస్టాఫీస్ పథకంతో సాధ్యం
రూ.5 లక్షల పెట్టుబడితో 15లక్షల రాబడి..ఆ పోస్టాఫీస్ పథకంతో సాధ్యం
విదేశాల్లోనూ పరుగులు పెట్టనున్న వందే భారత్ రైళ్లు.. అతి త్వరలోనే
విదేశాల్లోనూ పరుగులు పెట్టనున్న వందే భారత్ రైళ్లు.. అతి త్వరలోనే
పనికి రాడని పక్కనపెట్టేశారు.. కట్‌చేస్తే.. 10 సిక్సర్లతో సెంచరీ
పనికి రాడని పక్కనపెట్టేశారు.. కట్‌చేస్తే.. 10 సిక్సర్లతో సెంచరీ
కరెన్సీ నోట్లతో అలంకారం.. ఆ అమ్మవారి ప్రత్యేకత ఇదే..
కరెన్సీ నోట్లతో అలంకారం.. ఆ అమ్మవారి ప్రత్యేకత ఇదే..
మతిపోయే ఫీచర్లతో మోటో ఫోన్ లాంచ్.. ఫీచర్లు ఏంటంటే..?
మతిపోయే ఫీచర్లతో మోటో ఫోన్ లాంచ్.. ఫీచర్లు ఏంటంటే..?
శంకర్ దాదా ఎంబీబీఎస్ రీరిలీజ్..
శంకర్ దాదా ఎంబీబీఎస్ రీరిలీజ్..
ఇలా తయారవుతున్నారు ఎంట్రా..పంద్రాగస్టు నాడు స్వీట్లు ఇవ్వలేదని ..
ఇలా తయారవుతున్నారు ఎంట్రా..పంద్రాగస్టు నాడు స్వీట్లు ఇవ్వలేదని ..
14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో నయా వాచ్ రిలీజ్ చేసిన హువాయ్..!
14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో నయా వాచ్ రిలీజ్ చేసిన హువాయ్..!
అయ్యయ్యో! తాగిపడేసిన బీర్ టిన్‌లో దూరిన పాము.. ఆ తర్వాత జరిగింది?
అయ్యయ్యో! తాగిపడేసిన బీర్ టిన్‌లో దూరిన పాము.. ఆ తర్వాత జరిగింది?
అయ్యయ్యో! తాగిపడేసిన బీర్ టిన్‌లో దూరిన పాము.. ఆ తర్వాత జరిగింది?
అయ్యయ్యో! తాగిపడేసిన బీర్ టిన్‌లో దూరిన పాము.. ఆ తర్వాత జరిగింది?
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్