CM KCR: టీఆర్‌ఎస్ పార్టీ పేరు మార్పు కోసం పరిశీలనలో 200 పేర్లు.. ప్రధానంగా నాలుగు.. అవి ఇవే..
ప్రగతి భవన్‌లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. కొత్తగా పెట్టబోతున్న జాతీయ పార్టీపై నాయకులతో చర్చించనున్నారు. దసరా రోజున ప్రకటనపై చర్చించనున్నట్లు తెలిసింది.

సారు.. కారు.. పార్టీ పేరు.. తెలంగాణ గట్టుపై ఇప్పుడివే హాట్ టాపిక్స్. దసరా రోజు కేసీఆర్ జాతీయ పార్టీ అనౌన్స్‌మెంట్ పక్కా. మరి పార్టీ పేరేంటి? టీవీ9 ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో పేరు మాత్రమే ఛేంజ్ చేయబోతున్నారు. తెలంగాణ పేరుకి బదులు మరో పేరును పరిశీలిస్తున్నారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశమయ్యాకరు సీఎం కేసీఆర్. జాతీయ పార్టీ అవసరం, లక్ష్యం, జెండా, ఎజెండాపై నేతలకు వివరించనున్నారు. పార్టీ పేరుకి సంబంధించి నేతల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు.
జాతీయ పార్టీకి సంబంధించి దాదాపు 200 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో ఏది ఫైనల్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రధానంగా నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం.
1. భారత రాష్ట్రీయ పార్టీ 2. భారతీయ రాష్ట్రీయ పార్టీ 3. నవ భారత్ రాష్ట్రీయ పార్టీ 4. మహా భారత్ రాష్ట్రీయ పార్టీ
జాతీయ పార్టీ పేరుపై సీఎం కేసీఆర్ చాలా కసరత్తు చేస్తున్నారు. పేర్లపై నేతల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌లో ఎన్ని లెటర్స్ ఉండాలి.. ఎలా ఉండాలో న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. గతంలో ఉన్న పార్టీల పేర్లను టచ్ చేయకుండా సరికొత్తగా నేమ్ పెట్టాలని భావిస్తున్నారు గులాబీ బాస్. విజయదశమి రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్. అద్భుతమైన ఎజెండాతో రాబోతున్నట్టు టీజర్ వదిలారు. కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించి ఫుల్ డిటేయిల్స్ సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రసారమయ్యే బరాబర్‌లో చూడండి.
పార్టీ పేరు మార్పు లేదా జాతీయ పార్టీపై ఇవాల్టి వరకు గోప్యత…
జాతీయ పార్టీపై ఇప్పటిదాకా ప్రతీ అంశాన్ని గోప్యంగా ఉంచారు గులాబీబాస్. ఒకరిద్దరు కీలక నాయకులతో మాత్రమే చర్చించారు. ఇవాళ జరగబోయే సమావేశంలో అవన్నీ రివీల్ చేయబోతున్నారు. అలాగే వాళ్ల సలహాలు, సూచనలు కూడా తీసుకోనున్నారు. జాతీయ పార్టీ ప్రకటన తర్వాత తొలి బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలన్నది ఈ సమావేశంలో ఫైనల్ కానుంది. కేసీఆర్ సెంటిమెంట్‌గా భావించే కరీంనగర్‌లోనే సభ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఢిల్లీ దద్దరిల్లేలా మరో బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు గులాబీ బాస్.
పార్టీ ప్రకటన తర్వాత బహిరంగ సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు వేర్వేరు రాష్ట్రాల్లో వీలైనన్ని చోట్ల ఎక్కువగా నిర్వహించాలన్న ప్లాన్‌లో ఉన్నారు కేసీఆర్. అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండేలా చూస్తున్నారట. తెలంగాణలో అమలుచేస్తున్న రైతు బంధు, దళిత బంధు, పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలను గ్రాండ్‌గా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. బహిరంగ సభలకు.. కలిసొచ్చే పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించాలని గులాబీబాస్ వ్యూహాలు రచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇవాళ సీఎంతో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుల లంచ్ భేటీ తర్వాత జాతీయ పార్టీకి సంబంధించి చాలా అంశాలపై స్పష్టత రానుంది.
మరిన్నితెలంగాణ వార్తల కోసం




