AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: మహాత్ముడి సిద్ధాంతాలు ఎన్నటికైనా విశ్వజనీనం.. గాంధీ ఆసుపత్రి సిబ్బందిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు..

గాంధీని కొందరు హేళన చేస్తే ఆయన గొప్పతనం తగ్గదని అన్నారు సీఎం కేసీఆర్‌. దేశంలో ఏం జరుగుతుందో అందరూ గమనించాలని కోరారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో నిర్మించిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.

CM KCR: మహాత్ముడి సిద్ధాంతాలు ఎన్నటికైనా విశ్వజనీనం.. గాంధీ  ఆసుపత్రి సిబ్బందిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు..
CM KCR
Sanjay Kasula
|

Updated on: Oct 02, 2022 | 12:57 PM

Share

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆవరణలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్నిముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. గాంధీ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను, కరోనా కాలంలో ధైర్యంగా పనిచేసిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని, వైద్యారోగ్య శాఖ మంత్రి హరిష్ రావును సీఎం కేసీఆర్‌ అభినందించారు. అహింస సిద్ధాంతంతో గాంధీజీ.. బ్రిటీష్‌వారిపై పోరాడి విజయం సాధించారని కొనియాడారు. అంతకముందుకు సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. ధ్యానమూర్తిలో ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించడం గొప్ప విషయమన్నారు. కరోనా విపత్తు వేళ గాంధీ ఆస్పత్రి సేవలు ప్రశంసనీయమని.. మిగతా ఆస్పత్రుల్లో తిరస్కరించినా ఇక్కడికి తెచ్చి రోగుల ప్రాణాలు కాపాడారని గాంధీ ఆస్పత్రి వైద్యులను ప్రశంసించారు. గాంధీ స్ఫూర్తితో పనిచేసిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనందరం చేసుకున్న పుణ్యం. గాంధీజీ విశ్వజనీన సిద్ధాంతాలు ప్రతిపాదించారు. అహింస, శాంతి, ధర్మం, సేవ, త్యాగనిరతి సిద్ధాంతాలు విశ్వజనీమని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. సమస్యలకు యుద్ధాలు పరిష్కారం కాదని చాటిచెప్పిన మహనీయుడు గాంధీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. మానవాళికి గొప్ప సందేశం, మార్గాన్ని చూపించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీఅని అన్నారు.

మార్టిన్ లూథర్ వంటి వారు గాంధీ మార్గాన్ని అభినందించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దలైలామా సైతం గాంధీ తనకు ఆదర్శం అని చెప్పారన్నారు. ప్రేమ, ఆప్యాయత ద్వారా అసహాయతను ఎదుర్కోవచ్చని చెప్పారు.. గాంధీజీని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మహాత్ముడిగా సంబోధించారన్నారు. అహింసతో స్వరాజ్యం సాదిద్ధామని గాంధీజీ ప్రతిపాదించారని సీఎం కేసీఆర్ తెలిపారు.

మరిన్నితెలంగాణ వార్తల కోసం