AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గజ్వేల్‌ నియోజకవర్గంపై కొనసాగుతోన్న ఉత్కంఠ.. బీజేపీ క్యాండేట్ ఎవరంటే..

ఈ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠనెలకొంది. అటు హుజురాబాద్, ఇటు గజ్వెల్ నుంచి తాను పోటీలో ఉంటానని గురువారం ఈటెల రాజేందర్‌ తెలిపారు. కానీ ఈ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోవడంతో, బయట నుంచి ఇతర వ్యక్తులను ఇక్కడ పోటీలో...

Telangana: గజ్వేల్‌ నియోజకవర్గంపై కొనసాగుతోన్న ఉత్కంఠ.. బీజేపీ క్యాండేట్ ఎవరంటే..
Gajwel
P Shivteja
| Edited By: |

Updated on: Oct 13, 2023 | 7:14 PM

Share

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.. మిగత పార్టీలు అభ్యర్థులను ప్రకటించక పోయిన పలనా నియోజక వర్గంలో పలన అభ్యర్థి పోటీలో ఉంటాడు అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం కమలం పార్టీ నుండి ఎవరు పోటీలో ఉంటారు అనే విషయంలో మాత్రం ఇంకా అయోమయంగానే ఉంది. ఆ నియోజకవర్గం మరెదో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌.

ఈ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠనెలకొంది. అటు హుజురాబాద్, ఇటు గజ్వేల్ నుంచి తాను పోటీలో ఉంటానని గురువారం ఈటెల రాజేందర్‌ తెలిపారు. కానీ ఈ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోవడంతో, బయట నుంచి ఇతర వ్యక్తులను ఇక్కడ పోటీలో దింపారు. అయితే సీఎం కేసీఆర్ ఇలాఖాలో కమలం పార్టీకి సరైన నేతలు లేరని గ్రహించిన అధిష్టానం.. ఇక్కడ నందన్ గౌడ్ అనే వ్యక్తిని నియమించి పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని అతనికి చెప్పారు. దీంతో గత రెండు సంవత్సరాల నుంచి గజ్వేల్‌ నియోజకవర్గం బీజేపీ కొంత యాక్టివ్ అయ్యిందని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరిగింది.

కమలం పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్ఛిన నందన్ గౌడ్ ఆధ్వర్యంలో అవి సక్సెస్ అవుతున్నాయట..అయితే ఇప్పుడు నందన్ గౌడ్ గజ్వేల్ బీజేపీ టికెట్ ఆశిస్తున్నాడట ఈ నియోజకవర్గంలో ఇతర నేతలు కూడా పెద్దగా లేకపోవడంతో ఇక టికెట్ ఆయనకే అనే నమ్మకంతో పనిచేశాడట. ఆయన అనుచరులు కూడా టికెట్ తమ నేతకే వస్తుంది అని నియోజకవర్గ వ్యాప్తంగా బాగా ప్రచారం చేశారని సమాచారం. అయితే తాజాగా ఇప్పుడు ఈటెల రాజేందర్ పేరు తెర పైకి రావడంతో నందన్ గౌడ్ వర్గంలో అలజడి మొదలు అయ్యిందట. ఇన్ని రోజులు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, దానికి తగిన ప్రతిఫలం అందదేమో అని ఆందోళనకు గురవుతున్నారంటా నందన్ గౌడ్ వర్గం. మొన్నటి వరకు ఈటెల రాజేందర్ పోటీలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగిందే తప్ప.. ఎప్పుడు అతను ఓపెన్ కాకపోవడంతో వీరిలో ఆశలు బాగా పెరిగాయట.. ఈటల రాజేందర్ ఒక వేళ గజ్వేల్‌ లో పోటీ చేస్తే.. తన పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో పడ్డారట నందన్.

నియోజకవర్గ పరిధిలో పార్టీకి ఎవరు అండగా లేనప్పుడు మనం పనిచేశామని, ప్రతీ కార్యక్రమం విజయవంతం చేశామని, ఎట్టి పరిస్థితుల్లో మనం వెనక్కి తగ్గదిలేదని నందన్ గౌడ్ అనుచరులు చెబుతున్నప్పటికీ నందన్ గౌడ్ మాత్రం ఎక్కడ తొందరపడవద్దు అని చెబుతున్నాడట. పార్టీ లైన్ దాటవద్దు అని, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం అని తన కార్యకర్తలకు సర్ది చెబుతున్నారట. ఉంటే ఉగాది.. లేకుంటే శివరాత్రి అన్నట్లుగా ఉందట గజ్వేల్‌బీజేపీ పరిస్థితి. గతంలోనేమో ఇక్కడ పోటీ చేయడానికి ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మాత్రం ఒకరి పై ఒకరు పోటీ పడుతున్నారట. మరి ఇక్కడ నిజంగానే కేసీఆర్ పై ఈటెల పోటీ చేస్తాడా…? ఒక వేళ ఆయన పోటీ చేస్తే ఇక్కడి క్యాడర్ ఆయనకు సపోర్ట్ చేస్తుందా..అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని బహిరంగగానే చర్చించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..