Telangana: భార్యకు ఆ వీడియోలు చూపించి వేధించేవాడు.. తట్టుకోలేని ఆమె ఏం చేసిందో తెలిసి అవాక్కైన పోలీసులు..
అతనికి అప్పటికే పెళ్లైంది. అయినా ఇంకో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన భార్య ఏమీ అనలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ ప్రబుద్ధుడు ఇతర మహిళలతోనూ వివాహేతర సంబంధం ఏర్పచుకున్నాడు. అంతే కాకుండా...

అతనికి అప్పటికే పెళ్లైంది. అయినా ఇంకో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన భార్య ఏమీ అనలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ ప్రబుద్ధుడు ఇతర మహిళలతోనూ వివాహేతర సంబంధం ఏర్పచుకున్నాడు. అంతే కాకుండా వారితో కలిసి ఉన్న సమయాన్ని వీడియో తీశాడు. వాటిని భార్యకు చూపించి వేధించేవాడు. ఇక అతని వేధింపులు తట్టుకోలేక ఆమె.. భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. రూ.4 లక్షలతో సుపారీ మాట్లాడుకుని దారుణంగా హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియకుండా పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన స్టైల్ లో దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జన్నారపు వేణుకుమార్.. చిట్‌ఫండ్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన భార్య రైల్వే లోకోషెడ్‌లో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో వేణు కుమార్ మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సుస్మిత భర్తను ఏమీ లేదు. దీన్ని అలుసుగా తీసుకున్న వేణు.. ఇతర మహిళలతోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీశాడు. వాటిని తన భార్యకు చూపిస్తూ వేధిస్తుండే వాడు. దీంతో ఇద్దరి మధ్య మొదలైన గొడవలు నిత్యకృత్యంగా మారింది. అయినప్పటికీ వేణులో మార్పు రాకపోవడంతో తన భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది.
తనకు తెలిసిన అనిల్ ను సహాయం చేయాలని కోరింది. అనిల్.. రత్నాకర్ అనే మరో వ్యక్తిని సంప్రదించాడు. వేణు ను హత్య చేసేందుకు రూ.4 లక్షల సుపారీ మాట్లాడుకున్నారు. ముందస్తుగా రూ.2లక్షలు చెల్లించారు. పక్కా ప్లాన్ ప్రకారం గత సెప్టెంబరు 30న సుస్మిత పాలలో నిద్రమాత్రలు కలిపి వేణు కు ఇచ్చింది. అతను గాఢ నిద్రలోకి వెళ్లగానే రత్నాకర్ కారులో తీసుకుని పెద్దపల్లి జిల్లా మంథని వెళ్లాడు. అక్కడికి వెళ్లాక.. వేణుకుమార్ దుస్తులన్నీ తీసి మానేరు వాగులో పడేశారు. అయితే.. పై నుంచి కిందికి పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలై చనిపోయాడు. పోలీసులకు మృతదేహం లభించండంతో మొదటగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు.
మరోవైపు.. సుస్మిత అక్టోబరు 7న కాజీపేట పోలీస్ స్టేషన్‌లో తన భర్త వేణు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. అయితే విచారణ వేగవంతం చేయాలని, త్వరగా తన భర్త ఆచూకీ తెలపాలని పదే పదే కోరుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ చేపట్టగా ఈ విషయాలన్నీ తెలిశాయి. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..