Hyderabad: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని.. రూ. 4 కోట్ల స్పోర్ట్స్ కారును తగులబెట్టిన దుండగులు

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న అక్కసుతో రూ.80 లక్షల విలువైన స్పోర్ట్స్ కారును కాల్చి బూడిద చేశారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ పాతబస్తీ ​పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్సింగ్‌ ప్రాంతానికి చెందిన నీరజ్ అనే వ్యాపారి రూ.4 కోట్ల విలువ కలిగిన లంబోర్ఘి అనే స్పోర్ట్స్ ​కారు‌ను సెకండ్ ​హ్యాండ్‌లో కొనుగోలు చేశాడు. ఆ కారుపై మోజు తీరడంతో అమ్మేలానుకున్నాడు.

Hyderabad: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని.. రూ. 4 కోట్ల స్పోర్ట్స్ కారును తగులబెట్టిన దుండగులు
Lamborghini Sports Car Fire
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Balaraju Goud

Updated on: Apr 14, 2024 | 3:13 PM

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న అక్కసుతో రూ.80 లక్షల విలువైన స్పోర్ట్స్ కారును కాల్చి బూడిద చేశారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ పాతబస్తీ ​పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్సింగ్‌ ప్రాంతానికి చెందిన నీరజ్ అనే వ్యాపారి రూ.4 కోట్ల విలువ కలిగిన లంబోర్ఘి అనే స్పోర్ట్స్ ​కారు‌ను సెకండ్ ​హ్యాండ్‌లో కొనుగోలు చేశాడు. ఆ కారుపై మోజు తీరడంతో అమ్మేలానుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే తనకు పరిచయస్తుడైన అయాన్ ​అనే వ్యక్తికి కారు విక్రయించే బాధ్యతను అప్పగించాడు. దీంతో అయాన్ తన స్నేహితుడైన హైదరాబాద్ పాతబస్తీ మొఘల్‌​పురా ప్రాంతానికి చెందిన అమన్‌ను సంప్రదించాడు. దీంతో కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని అమన్‌కు అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు. కారును చూసుకునేందుకు మామిడిపల్లి నుంచి శంషాబాద్ వెళ్ళే దారిలో ఉన్న తన ఫాం హౌజ్‌కు తీసుకురావాలని అహ్మద్ ​చెప్పాడు. నీరజ్​ దగ్గర నుంచి అయాన్ ​కారు తీసుకువచ్చి అమన్‌కు ఇచ్చాడు.

అమన్ అతని స్నేహితుడు హందాన్‌తో కలిసి జల్‌పల్లి‌లో ఆ స్పోర్ట్స్ ​కారును తీసుకుని మామిడిపల్లిలోని వివేకానంద విగ్రహం ఎయిర్ ​పోర్ట్ ​రూట్‌ మధ్యలో ఆపారు. అహ్మద్‌తో పాటు మరి కొంత మంది కారు వద్దకు చేరుకుని, కారు అసలు ఓనర్ నీరజ్ గురించి ఆరా తీశారు. అతను మాకు డబ్బులు ఇవ్వాలని దుర్భాషలాడారు. నీరజ్‌ను పిలిపిస్తామని చెప్పిన వినకుండా అహ్మద్ ​వెంట వచ్చిన వ్యక్తులు, బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను స్పోర్ట్స్ కారుపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అమన ​డయల్​100 కి ఫోన్​ చేసి ఫిర్యాదు చేశారు. పహాడీషరీఫ్ ​పోలీసులు, ఫైర్​ఇంజన్​ ఘటనా స్థలికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అమన్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…