Lok Sabha Election: హైదరాబాద్‌లో ఇప్పటి వరకు రూ.13.72 కోట్ల నగదు సీజ్.. ఒక్కరోజే ఎంతో తెలుసా..?
సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో.. తెలంగాణ వ్యాప్తంగా భారీగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. దీంతో పెద్దమొత్తంలో అక్రమ నగదు లభ్యమవుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరంలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా ఇప్పటి వరకు 13 కోట్ల 72 లక్షల 28 వేల ,460 రూపాయల నగదుతో పాటు ఒక కోటి 88 లక్షల 95 వేల 185 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 20,090.38 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు.

ఇక, ఇప్సటి వరకు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 167 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇందుకు సంబంధించి 161 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువుల పై 340 ఫిర్యాదులు రాగా, వాటిని పరిష్కరించామని వెల్లడించారు. ఇక మొత్తంగా 221 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, లైసెన్సు గల 2,686 ఆయుధాలను డిపాజిట్ చేసినట్టు రోనాల్డ్ రోస్ తెలిపారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో రూ. 26.91 లక్షల నగదు, 33,839 రూపాయల విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 101.61 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, ఏడుగురిపై కేసులు నమోదు చేసి, 6 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు ఇతర వస్తువులపై 14 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని, ఏడుగురిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. 93 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ. 2.95 కోట్ల నగదును, పోలీసు, ఆదాయ పన్నుల శాఖ ద్వారా రూ.10.61 కోట్లు, ఎస్ఎస్టీ బృందాల ద్వారా రూ.15.80 లక్షల నగదు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఇక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపట్లు కఠినంగా వ్యవహారిస్తామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ హెచ్చరించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…