AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!

బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోయి బాధితులు వేలు, లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడమో లేదా అవమానంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడడమో చేస్తున్నారు.

Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!
అయితే సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండాలన్నా, కోల్పోయిన డబ్బును మళ్లీ తిరిగి పొందాలన్నా కొన్ని రకాల మార్గాలు ఉన్నాయని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వాల వరకు, బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు ప్రతి ఒక్కరూ అవగాహన కల్పిస్తున్నారు.
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Nov 03, 2024 | 7:29 PM

Share

లోన్ యాప్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు మోసాల వల వేస్తున్నారు. బాధితులు ఈ యాప్‌ల ను ఇన్‌స్టాల్ చేసుకోవడంతో, వారి ఫోన్లపై నేరస్తులు నియంత్రణ పొందుతారు. ఎలాంటి డాక్యుమెంట్‌లు లేకుండా చిన్న మొత్తంలో రుణాలు ఇస్తారు, కానీ తర్వాత బాధితుల ఫోటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. కేవలం రెండు వేల నుండి అయిదు వేల రూపాయల వరకు అప్పుగా ఇచ్చి, ఆ తర్వాత లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకుంటే బాధితుల మార్పిడి ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామని లేదా వాళ్ల పరిచయస్తులకి పంపుతామని బెదిరింపులకు పాల్పడుతారు. వారి బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోయి బాధితులు వేలు, లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడమో లేదా అవమానంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడడమో చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు పెరిగిపోవడంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. లోన్ యాప్ లో రుణాలు తీసుకోవడం ద్వారా తలెత్తే అనర్థాలను వివరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. లోన్ యాప్ నేరగాళ్ల బారిన పడకండని …ఒకవేళ మీరు బాధితులు అయితే వెంటనే Dail-100 లేదా 1930 కు కాల్ చేయాలని సూచిస్తున్నారు రాచకొండ పోలీసులు.

ఇటీవల హైదరాబాద్ కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్‌కు మూడు మెసేజ్ లు వచ్చాయి. 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే.. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు.. రూ.10 లక్షలు ఒకసారి.. అంటే మొత్తంగా రూ.1.10 కోట్ల భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా బ్యాంక్ నుంచి మేసేజ్ వచ్చింది. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది.

తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావటంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే తేరుకున్న అతను.. కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో అంటే 10.22 గంటల వేళలో 1930 నెంబరుకు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్.. జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టం సిబ్బందిని రంగంలోకి దించారు. తెలంగాణలో ఈ మోసం జరగటంతో వెంటనే రియాక్టు అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్‌లోకి వచ్చేసింది.

బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం యాక్సిస్.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి.. నిధుల్ని డ్రా చేయకుండా ఫుట్ ఆన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి రూ.10.42 గంటల వేళలో ఫోన్ కు మెసేజ్ వచ్చింది. సైబర్ నేరస్తులు దోచేసిన రూ.1.10 కోట్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. దీంతో.. డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరులోని ఖాతాలుగా గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా.. నిమిషాల్లో స్పందించి “1930” కు ఫోన్ చేస్తే.. డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మీకు తెలిసిన వారందరికి చెప్పండి. అందరిలోనూ “1930” నెంబరు మీద అవగాహన పెరిగేలా చేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..