Telangana Elections Voting Percent: తెలంగాణ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం
Telangana Assembly Polls Voting Percentage: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ముందుగా ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకూ 36.68శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ముందుగా ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకూ 36.68శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం పోలింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా మేడ్చల్‌లో 26.70 నమోదైనట్లు తెలిపారు.
అచ్చంపేట, జనగామతోపాటూ మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఖమ్మంతో పాటూ మరికొన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఓట్లను బహిష్కరించారు. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో కూడిన ఘర్షణ వాతావరణం నెలకొంది. వీరిని పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల మధ్య పోలింగ్ ఎంత శాతం నమోదైందో జిల్లాల వారీగా ఇప్పుడు చూద్దాం.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం..
- హనుమకొండ – 35.29
- హైద్రాబాద్ – 20.79
- జగిత్యాల – 46.14
- జనగాం – 44.31
- భూపాలపల్లి – 49.12
- గద్వాల్ – 49.29
- కామరెడ్డి – 40.78
- కరీంనగర్ – 40.73
- ఖమ్మం – 42.93
- ఆసిఫాబాద్ – 42.77
- మహబూబాబాద్ – 46.89
- మహబూబ్‌నగర్ – 44.93
- మంచిర్యాల – 42.74
- మెదక్ – 50.80
- మేడ్చల్ – 26.70
- ములుగు – 45.69
- నగర కర్నూల్ – 39.58
- నల్గొండ – 39.20
- నారాయణపేట – 42.60
- నిర్మల్ – 41.74
- నిజామాబాద్ – 39.66
- పెద్దపల్లి – 44.49
- సిరిసిల్ల – 39.07
- రంగారెడ్డి – 29.79
- సంగారెడ్డి – 42.17
- సిద్దిపేట – 44.35
- సూర్యాపేట – 44.14
- వికారాబాద్ – 44.85
- వనపర్తి – 40.40
- వరంగల్ – 37.25
- యాదద్రి – 45.07
పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..
పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..