AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వార్నీ వేషాలో.. గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన దంపతులు..!

గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టారు భార్యాభర్తలు. బంగారాన్ని కుదవ పెట్టి ఆ బంగారాన్ని విడిపించడానికి మరో బ్యాంక్‌లో డబ్బును తీసుకున్నారు. ఇలా ఏకంగా 51 లక్షల రూపాయలను కొట్టేశారు ఈ ఇద్దరు.. హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Telangana: వార్నీ వేషాలో..  గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన దంపతులు..!
Gold Loan
Vijay Saatha
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 20, 2024 | 8:43 PM

Share

గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టారు భార్యాభర్తలు. బంగారాన్ని కుదవ పెట్టి ఆ బంగారాన్ని విడిపించడానికి మరో బ్యాంక్‌లో డబ్బును తీసుకున్నారు. ఇలా ఏకంగా 51 లక్షల రూపాయలను కొట్టేశారు ఈ ఇద్దరు.. హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

బంగారాన్ని లోన్ పెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బ్యాంకుల్లో ఘరానా మోసానికి పాల్పడ్డారు దంపతులు. నాలుగు బ్యాంకుల్లో 51 లక్షల రూపాయలను కొట్టేశారు ఈ ఇద్దరు. దీంతో ఆయా బ్యాంకుల మేనేజర్లు లబోదిబోమంటూ పోలిసులను అశ్రయించారు. ఈ ఘటన మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే నిందితులు ఒక బ్యాంకులో బంగారాన్ని కుదరవ పెట్టి ఆ బంగారాన్ని విడిపించడానికి మరో బ్యాంకులో లోన్ తీసుకుని అలా ఒకే రోజు నాలుగు బ్యాంకులను మోసం చేశారు. అయా బ్యాంకుల్లో ఉన్న నిబంధనను తనకు అనుకూలంగా మార్చుకుని తనదైన శైలిలో డబ్బులు దోచారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పారిపోయారు.

ఇలా కేఎల్ఎం బ్యాంకులో 15 లక్షల రూపాయలు, ఐసిఐసిఐ బ్యాంకులో పన్నెండు లక్షలు ముత్తూట్ బ్యాంకులో 12 లక్షలు కోసమటం బ్యాంకులో పన్నెండు లక్షలు ఇలా మొత్తం 51 లక్షల రూపాయలతో నిందితుడు పరారయ్యారు. మొదటగా మల్కాజిగిరిలో కేసు నమోదు అవ్వక సైబర్ క్రైమ్ సహాయంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ మధ్యకాలంలో బ్యాంకులలో ఉన్న నగదును గుట్టుచప్పుడు కాకుండా దోచుకుంటున్న ఘటనలు చూసాం. అయితే ఇప్పుడు కొందరు వ్యక్తులు తాజాగా ఇప్పుడు గోల్డ్ లోన్ పేరుతో ఈ విధంగా సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ రకాలుగా కొంతమంది కస్టమర్లు బంగారాన్ని బ్యాంకులో కుదవపెట్టి ఇంటి కోసమో ఇతరత్రా ఖర్చులకోసం వాటిని భద్రంగా బ్యాంకులో ఉంచుతారు. ఆ తర్వాత కొంత అమౌంట్ ని తీసుకుని వాళ్ళ పనుల కోసం వినియోగించుకుంటారు. అయితే ఇప్పుడు అదే పద్ధతిలో దంపతులు బంగారాన్ని కుదవాబెట్టి ఈ విధంగా బ్యాంకులు మార్చుతూ లక్షల రూపాయలను దోచుకున్నారు.

ప్రస్తుతం దంపతులను అదువులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిందితుల వివరాలను వెల్లడించలేదు. బంగారాన్ని కుదరపు పెట్టి డబ్బులు అడిగి వారి పట్ల బ్యాంకులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…