Hyderabad: బిర్యానీలో ఈగ.. అవాక్కైన బాధితుడు.. అదిరిపోయే తీర్పు ఇచ్చిన వినియోగదారుల ఫోరం..
ప్రస్తుతం లైఫ్ స్టైల్, ట్రెండ్ మారిపోయింది. బీజీ లైఫ్ కారణంగా వంట వండుకుని తినే సమయం లేకుండా పోయింది. ఇక ఆఫీస్ కు వెళ్లేవారి పరిస్థితి అయితే మరింత దారుణం. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లపై...

ప్రస్తుతం లైఫ్ స్టైల్, ట్రెండ్ మారిపోయింది. బీజీ లైఫ్ కారణంగా వంట వండుకుని తినే సమయం లేకుండా పోయింది. ఇక ఆఫీస్ కు వెళ్లేవారి పరిస్థితి అయితే మరింత దారుణం. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లపై ఆధారపడుతుంటారు. ప్రజల అవసరాలను గమనించిన కొన్ని డెలివరీ సంస్థలు కూడా సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా తమకు కావాల్సినవి, నచ్చినవి ఆర్డర్లు పెట్టుకుని మరీ లాగించేస్తుంటారు. రుచికరంగా అనిపిస్తే చాలు.. అడ్డూ అదుపూ లేకుండా తినేస్తున్నారు. అయితే..అది ఎక్కడి నుంచి వస్తుంది.. ఎలా తయారవుతోంది.. అనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా అడ్డమైన రోగాలు వస్తున్నాయి. అయితే కొన్ని ఘటనల్లో మనం ఆహారంలో పురుగులు, బొద్దింకలు, ఈగలు కనిపించిన ఘటనలు చూశాం. అయితే.. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అంటారా.. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదివేయండి..
హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా చదువుతున్న రాజేష్.. గతేడాది అక్టోబర్ 21న నల్లకుంటలోని ఓ బిర్యానీ హౌస్‌లో భోజనం చేశాడు. ఆ సమయంలో అందులో ఈగ కనిపించింది. ఈ విషయం గురించి వివరిస్తూ ఆయన హోటల్ నిర్వాహకులకు కంప్లైంట్ చేశారు. అయితే నిర్వాహకులు పట్టించుకోలేదు. అంతే కాకుండా బిర్యానీకి బిల్లు వసూలు చేశారు. దీంతో రాజేష్ అవాక్కయ్యాడు. వెంటనే వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు.
ఈ కేసుపై విచారణ జరిపిన ఫోరం.. ఫిర్యాదు దారుడికి నష్ట పరిహారంగా రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు జరిగినట్లు మరొకరికి జరగకూడదనే ఫోరంలో కేసు వేసినట్లు రాజేష్ తెలిపాడు. కాబట్టి.. బయట హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం