AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: కాంగ్రెస్‌ స్ట్రాటజిస్ట్‌ సునీల్‌ కనుగోలు ఆఫీస్‌లో సోదాలపై దుమారం.. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు..

కాంగ్రెస్‌ స్ట్రాటజిస్ట్‌ సునీల్‌ కనుగోలు ఆఫీస్‌లో పోలీసు సోదాల వివాదం చాలా మలుపులే తిరిగింది. ఇప్పటికే కావాల్సినంత కాంట్రవర్సీ క్రియేట్ అయింది. పొలిటికల్ మంటలూ రాజుకున్నాయి..! ఆందోళనలతో రోజంతా హైటెన్షన్‌ కంటిన్యూ అయింది. ఇంతకీ కాంగ్రెస్ వర్షనేంటి? పోలీసులు ఏం చెబుతున్నారు?

Telangana Congress: కాంగ్రెస్‌ స్ట్రాటజిస్ట్‌ సునీల్‌ కనుగోలు ఆఫీస్‌లో సోదాలపై దుమారం.. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు..
Congress
Sanjay Kasula
|

Updated on: Dec 14, 2022 | 9:57 PM

Share

కాంగ్రెస్ భగ్గుమంది. సునీల్‌ కనుగోలు ఆఫీస్‌లో సోదాలు, సీజ్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతటా రోడ్డెక్కారు. గాంధీభవన్‌ వద్ద గంటసేపు హైడ్రామా నడిచింది. BRS ఆఫీస్‌, కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ను ముట్టడించేందుకు చేసిన ప్రయత్నాలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జరిగినవి సోదాలు కాదు .. దొంగతనం అంటోంది కాంగ్రెస్.! తమ పార్టీకి చెందిన కీలక డేటాను దొంగలించే కుట్రే ఇదని ఆరోపిస్తోంది. సునీల్ కనుగోలు తెలంగాణకు మాత్రమే కాదు.. కర్నాటకకు కూడా స్ట్రాటజిస్ట్. త్వరలో అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. అందుకే బీఆర్ఎస్-బీజేపీ కలిసి తమ డేటాను దొంగలించాయన్నది కాంగ్రెస్ వర్షన్..!

మొత్తం ఎపిసోడ్‌పై హైదరాబాద్‌ సీపీని కలిసి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌ నేతల బృందం. పోలీసులు సరిగా స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గాంధీభవన్ దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సీపీ కార్యాలయానికి బయల్దేరారు జగ్గారెడ్డి. పోలీసులు అడ్డుకోవడం టెన్షన్‌ క్రియేట్‌ చేసింది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్సే లేకుండా చేస్తారని తాము అవగాహన చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.

నోటీసులు లేకుండా కాంగ్రెస్ వార్‌రూమ్‌పై దాడికి దిగారని ఆరోపించారు రేవంత్. వార్‌రూమ్ దాడికి వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు. లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. KCR ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఉపేక్షించదన్నారు రేవంత్.

పోలీసుల వర్షన్ మాత్రం డిఫరెంట్‌గా ఉంది. కాంగ్రెస్‌ స్ట్రాటజిస్ట్‌ సునీల్‌ కనుగోలు ఆఫీస్‌లో సోదాలపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. 5 నెలలుగా చాలా అభ్యంతకరంగా పోస్టులు పెడుతున్నందునే తనిఖీలు చేశామని చెప్పారు. వీడియో మార్ఫింగ్‌ కేసులో ఏ1గా సునీల్‌ కనుగోలును చేర్చారు. ఇప్పటికే ముగ్గురికి 41 CRPC కింద నోటీసులు ఇచ్చారు. శ్రీప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మను ప్రధాన నిందితులుగా గుర్తించామన్నారు జాయింట్ సీపీ భూపాల్.

హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తించింది కాంగ్రెస్. అటు ఈ ఇష్యూని కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా సీరియస్‌గా తీసుకుంది. BRS ఆఫీస్‌, కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్‌ క్రియేట్‌ అయింది. బారీకేడ్లను తోసుకొని ముందుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పలువురు రోడ్లపై పరుగులు తీయడంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. BRS ఆఫీస్‌ దగ్గర బలగాలను మోహరించారు.

హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తించింది కాంగ్రెస్…! నిజామాబాద్‌లో BRS ఆఫీస్‌ను ముట్టడించారు..కార్యాలయంలోకి చొచ్చుకోళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత యూత్‌ కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేశారు పోలీసులు. లోక్‌సభలోనూ ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ స్పీకర్ అంగీకరించలేదు..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం