Andhra Pradesh: దయచేసి వినండి.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు వచ్చాయండి.. ఛార్జీలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. వివిధ పనుల కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడిన వారు పండుగ రోజు సొంతూళ్లకు వెళ్లేందుకు...

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. వివిధ పనుల కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడిన వారు పండుగ రోజు సొంతూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బంధుమిత్రుల సమక్షంలో పండుగ చేసుకునేందుకు బయల్దేరతారు. అయితే వీరి కోసం.. అధికారులు ప్రత్యేక రైళ్లు, బస్సులు నడిపిస్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ప్రకటించగా.. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ కూడా సంక్రాంతికి ఊరెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. జనవరి 6 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని నిర్ణయించింది. పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ సర్వీసులు నడపనున్నారు. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించనున్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
కాగా.. సంక్రాంతి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సొంతుళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,233 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు సర్వీసులు అందించనున్నాయి. వీటిలో 585 బస్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఈ మేరకు టీఆర్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ 10 శాతం బస్సులను అదనంగా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.
అమలాపురానికి 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరానికి 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచారు. వచ్చే ఏడాది జూన్ వరకు ఈ విధానం అందుబాటులో ఉండనుంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..