Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీకాంగ్రెస్‌ యువ సంఘర్షణ సభ సక్సెస్సేనా..! తెలంగాణ సమాజంపై ప్రియాంకగాంధీ చూపించిన ఇంపాక్ట్‌ ఎంత?

అందులో ఒకరు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మరొకరు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డికి మాట్లాడే అవకాశం రాలేదు. ఇక, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ లాంటి సీనియర్‌ లీడర్లు డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది. కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు, పైగా సోనియాగాంధీ కుమార్తె, రాహుల్‌ సోదరి హైదరాబాద్‌ వస్తే, సభకు హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

టీకాంగ్రెస్‌ యువ సంఘర్షణ సభ సక్సెస్సేనా..! తెలంగాణ సమాజంపై ప్రియాంకగాంధీ చూపించిన ఇంపాక్ట్‌ ఎంత?
Priyanka Gandhi
Follow us
Jyothi Gadda

|

Updated on: May 09, 2023 | 7:06 AM

సరూర్‌నగర్‌ యువ సంఘర్షణ సభ. యువత, నిరుద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ. పైగా ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ హాజరైన మీటింగ్‌. టీకాంగ్రెస్‌ లీడర్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ఈ సభ సక్సెస్‌ అయ్యిందా?. కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త జోష్‌ నింపిందా?. తెలంగాణ యువతకు భరోసా ఇవ్వగలిగిందా? అంటే గాంధీభవన్‌ వర్గాలు కూడా ఆన్సర్‌ చెప్పలేని పరిస్థితి. ప్రియాంక సభతో కాంగ్రెస్‌కి మైలేజ్‌ వచ్చిందా?, తెలంగాణ ప్రజలను కొంచెమైనా ఆకట్టుకోగలిగారా! అంటే నీళ్లు నమలాల్సిన పరిస్థితి. జనం సంగతి పక్కన పెడదాం, అసలు కాంగ్రెస్‌ శ్రేణుల్లోనే నిరుత్సాహం కనిపిస్తోంది.

వరంగల్‌ సభలో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌ ప్రకటిస్తే, ఇప్పుడు సరూర్‌నగర్‌ మీటింగ్‌లో యూత్‌ డిక్లరేషన్ అనౌన్స్‌ చేశారు ప్రియాంక. ఒకరకంగా ఇద్దరూ మేనిఫెస్టోనే ప్రకటించారు. అయితే, ప్రియాంక విషయంలో వచ్చారు, మాట్లాడారు, వెళ్లిపోయారు అన్నట్టుంది. అంతకంటే ఇంకేముంది అనే మాట కాంగ్రెస్‌ వర్గాల నుంచే వినిపిస్తోంది. ప్రియాంక తెలంగాణకు వచ్చి-వెళ్లినా పెద్దగా ఇంపాక్ట్‌ చూపించలేకయారనేది ఇన్‌సైడ్‌ నుంచి వస్తోన్న గుసగుసలు. అయితే, సరూర్‌నగర్‌ సభలో సుమారు 25 నిమిషాలు ప్రసంగించిన ప్రియాంకగాంధీ… BRS ప్రభుత్వాన్ని ఎండగడుతూనే, కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే ఏం చేస్తుందో చెప్పుకొచ్చారు. ఏ ఒక్క హామీని కేసీఆర్‌ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు ప్రియాంక. TSPSC పేపర్లు లీక్‌ చేసి యువత జీవితాలతో ఆడుకున్నారని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యూత్‌ డిక్లరేషన్‌ ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసి తీరుతామన్నారు. ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాల భర్తీ, అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నెలనెలా 25వేల పెన్షన్‌ ఇస్తామన్నారు. కేవలం హామీ ఇవ్వడమే కాదు, అమలు విషయంలో తామంతా జవాబుదారీగా ఉంటామన్నారు ప్రియాంక.

సరూర్‌నగర్‌ సభకు ప్రియాంక కనీసం గంట కూడా టైమ్‌ కేటాయించలేదంటున్నారు. పైగా ఆమె ఉన్న సమయంలో కేవలం ఇద్దరికి మాత్రమే ప్రసంగించే ఛాన్స్‌ దక్కింది. అందులో ఒకరు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మరొకరు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డికి మాట్లాడే అవకాశం రాలేదు. ఇక, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ లాంటి సీనియర్‌ లీడర్లు డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది. కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు, పైగా సోనియాగాంధీ కుమార్తె, రాహుల్‌ సోదరి హైదరాబాద్‌ వస్తే, సభకు హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రియాంక తెలంగాణ ప్రజానీకంపై ఇంపాక్ట్‌ చూపించారా? లేదా?. యువతను ఆకట్టుకునే స్పీచ్‌ ఇచ్చారా? లేదా? అనే సంగతి పక్కనబెడితే, సరూర్‌నగర్‌ వేదికగా ఎన్నికల శంఖరావాన్ని మాత్రం పూరించేశారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం, అలా చేయకపోతే నిగ్గదీసి అడగండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఓవరాల్‌గా ప్రియాంకగాంధీ సరూర్‌నగర్‌ సభలో కాంగ్రెస్‌ శ్రేణుల నుంచే భిన్నస్వరాలు వినిపించాయి. ఏదో హడావిడి ప్రోగ్రామ్‌గా చేశారంటూ మాట్లాడుకోవడం కనిపించింది. రాహుల్‌ వరంగల్‌ డిక్లరేషన్‌కి వచ్చిన మైలేజ్‌… సరూర్‌నగర్‌ యూత్‌ డిక్లరేషన్‌కి రాలేదంటున్నారు. దాంతో, మైలేజ్‌ సంగతి దేవుడెరుగు… మైనస్‌ కాకుండా ఉంటే చాలనే మాట వినిపిస్తోంది.