Muthireddy: మరో వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. సంతకాన్ని ఫోర్జరీ చేశారంటు కూతురు తుల్జాభవాని రెడ్డి ఫిర్యాదు
వివాదాలు ఆయనకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఎవరో కాదు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. తాజాగా మరో వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు నోటి మాటతోకాదు సొంత కుమార్తే ఆయనపై తిరగబడింది. అంతేకాదు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గతంలోను ఈ భూమిపై వివాదం నడిచింది. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ విపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు కూతురు తుల్జాభవానీ రెడ్డి ఫిర్యాదు చేయడంతో మరోసారి తెరపైకి వచ్చిన భూ వివాదం
వివాదాలు ఆయన చుట్టూ ప్రదక్ష చేస్తుంటాయి. కాదు కాదు.. ఆయన వాటి చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తాజాగా మరో కాంట్రవర్సిలోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలోను ఈ భూమిపై వివాదం నడిచింది. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ విపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు కూతురు తుల్జాభవానీ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి తెరపైకి వచ్చిన భూ వివాదం. పూర్తి వివరాల్లోకెళితే.. సిద్దిపేట జిల్లా చేర్యాలలోతనకు సంబంధించిన ఎకరం 20 గుంటల భూమిని ముత్తిరెడ్డి ఆక్రమించుకున్నారని తుల్జాభవాని రెడ్డి ఆరోపిస్తు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన సంతకం ఫోర్జరీ చేసి భూమి తీసుకున్నారని తండ్రి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపైనే ఆమె ఆరోపించారు. ఇదే విషయంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై కుమార్తె ఫిర్యాదు చేశారు.
తన పేరు మీద ఉన్న భూమినీ సంతకం ఫోర్జరీ చేసి తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు కూతురు తుల్జా భవాని రెడ్డి. గతంలోను ఈ భూమిపై వివాదం కొనసాగుతోంది. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశాడంటూ విపక్షాల గతంలో ఆరోపణలు, ఆందోళన చేశాయి. ఇప్పుడు కూతురు ఫిర్యాదు చేయడంతో మరోసారి తెరపైకి వచ్చిన భూ వివాదం వచ్చింది. ఆ మధ్య ఓ వివాదాస్పద 6 ఎకరాల స్థలంలో మున్సిపల్ నాలాకు అడ్డంగా వెంచర్ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీన్ని మాజీ సర్పంచి అడ్డుకోగా ముత్తిరెడ్డి నానా రచ్చే చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. మత్తడి సమీపంలో ముత్తిరెడ్డి యాదగిరి అర ఎకరం స్థలాన్ని ఆక్రమించారని స్థానిక విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మత్తడి నుంచి నిర్మించే కాలువ విషయంలోనూ డిజైన్ మార్చారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాను గుంట కబ్జా చేసినట్లు నిరూపించినా రాజీనామా చేస్తామని అప్పట్లో సవాల్ చేశారు. ఇప్పుడు సొంత ఇంటి నుంచే ఫిర్యాదు పోవడంతో పాత విషయాలన్నీ బయటికొస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం