AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లో దిగిన లేడీ ప్యాసింజర్.. తేడాగా ప్రవర్తన.. అనుమానంతో చెక్ చేయగా..

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి.. భారీగా హెరాయిన్ సీజ్‌చేశారు DRI అధికారులు. మలావి నుండి దోహా మీదుగా హైదరాబాద్‌కు వచ్చినట్లుగా అధికారులు..

Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లో దిగిన లేడీ ప్యాసింజర్.. తేడాగా ప్రవర్తన.. అనుమానంతో చెక్ చేయగా..
Heroin Smuggling
Sanjay Kasula
|

Updated on: May 09, 2023 | 8:37 AM

Share

5.90 కిలోల హెరాయిన్‌..41.3కోట్ల రూపాయల విలువజేసే మత్తు పదార్థం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి.. భారీగా హెరాయిన్ సీజ్‌చేశారు DRI అధికారులు. మలావి నుండి దోహా మీదుగా హైదరాబాద్‌కు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆ మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో.. తనిఖీలు చేశారు DRI అధికారులు. ఆమె లగేజీ బ్యాగ్‌లో సీక్రెట్‌గా దాచిన హెరాయిన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

దాని విలువ 41.3కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. నిషేధిత హెరాయిన్‌ను తీసుకొచ్చిన ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు. నార్కోటిక్స్ ఫీల్డ్-టెస్టింగ్ కిట్‌లతో పరీక్షించినప్పుడు.. ఎన్‌డిపిఎస్ చట్టం, 1985 కింద ఆమెను అరెస్ట్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ తరలించారు. తదుపరి విచారణ జరుగుతోందని DRI పోలీసులు తెలిపారు.

భారతీయురాలైన సదరు మహిళ, మాలావి నుంచి హెరాయిన్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో ఇచ్చేలా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు డీఆఆర్‌ఐ అధికారులు తెలిపారు. నిందితురాలిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హెరాయిన్‌ను ఎక్కడ, ఎవరికి చేరవేయాలనుకున్నారనే దానిపై ఆ మహిళను విచారిస్తున్నట్లుగా డీఆఆర్‌ఐ అధికారులు వెల్లడిచారు.

హెరాయిన్ చేరవేస్తే డబ్బు అందిస్తామంటూ మహిళను ట్రాప్ చేసినట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ విమానాశ్రయంలో నిర్దేశించిన ప్రాంతానికి తీసుకెళ్లాలని ఆమెకు స్మగ్లర్లు సూచించినట్లుగా తెలుస్తోంది. ఆమె తరలిస్తున్న సూటికేసులో అంత విలువైన సరుకు ఉన్నట్లుగా తెలియకపోవచ్చని  అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో హెరాయిన్‌ను తీసుకునే వాళ్ల వివరాలు సైతం నిందితురాలికి తెలియవని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?