AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay Kumar: దూకుడు పెంచిన బీజేపీ.. ముందస్తు ప్రచారం మొదలు పెట్టిన బండి సంజయ్

కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి మరోసారి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా... సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో సిట్టింగ్ ఎంపీల విషయంలో ఎలాంటి అయోమయం లేకుండా స్పష్టత ఇచ్చారు. దీంతో.. ముందుగానే వాల్ రైటింగ్ మొదలు పెట్టారు కొందరు బీజేపీ ఎంపీలు.

Bandi Sanjay Kumar: దూకుడు పెంచిన బీజేపీ.. ముందస్తు ప్రచారం మొదలు పెట్టిన బండి సంజయ్
Bandi Sanjay Amit Shah
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 04, 2024 | 5:49 PM

Share

కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి మరోసారి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా… సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో సిట్టింగ్ ఎంపీల విషయంలో ఎలాంటి అయోమయం లేకుండా స్పష్టత ఇచ్చారు. దీంతో.. ముందుగానే వాల్ రైటింగ్ మొదలు పెట్టారు కొందరు బీజేపీ ఎంపీలు. అంతేకాకుండా ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. సంక్రాతి తరువాత పూర్తి స్థాయి ప్రచారంలో దూసుకుపోయేందుకు రెఢి అవుతున్నారు. నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై భారతీయ జనతా పార్టీ మరింత ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ స్థానం కావడంతో బండి సంజయ్ కుమార్ ‌ను మరోసారి బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ ముఖ్యనేత అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు సంజయ్. ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి సంజయ్ కుమార్ ప్రాతివిధ్యం వహిస్తున్నారు. మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. అయితే అమిత్ షా హైదరాబాద్ పర్యటన కంటే ముందు ఇద్దరు, ముగ్గురు సీనియర్ నేతలు టికెట్ కోసం ప్రయత్నం చేశారు. అయితే, సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం అంటూ అమిత్ షా ప్రకటించడంతో అయోమయానికి తెరపడింది. దీంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ వాల్ రైటింగ్ చేయిస్తున్నారు. నిత్యం కరీంనగర్‌లోనే ఉంటూ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు.

అయితే కరీంనగర్ నియోజకవర్గంపై బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ నుంచి మరోసారి వినోద్ కుమార్ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా క్లారిటీ రాలేదు. సంక్రాంతి తరువాత హస్తం పార్టీ అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బండి సంజయ్ కుమార్ ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గట్టి పోటీ ఇచ్చినా, గెలువలేకపోయారు. మరోసారి ఎంపీగా పోటీకి సిద్ధమవడంతో ఈ ఎన్నికలు అంత్యంత కీలకంగా మారిపోయాయి.

గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రత్యర్ధిగా మారింది. కరీనంగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 7 సెగ్మెంట్లు ఉంటే, నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించగా, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి బీజేపీకి ఓటు శాతం భారీగా పెరిగింది. అంతేకాకుండా.. ప్రధాని మోదీ హవాతో పాటు, బండి సంజయ్ దూకుడు కలిసి వస్తుందని భావిస్తోంది కషాయదళం. ఈసారి ఎలాంటి పొరపాటు చేయకుండా గట్టిగా పని చేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు.

గత ఎన్నికల్లో బలమైన బీఆర్ఎస్ అభ్యర్థిని బీజేపీ ఓడగొట్టింది. గతంతో పోలీస్తే.. ప్రస్తుతం బీజేపీకి బలం పెరిగిందని బండి సంజయ్ భావిస్తున్నారు. ఇదిలావుంటే, ఈ నియోజకవర్గంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కన్నుపడింది. ఈసారి ఎలాగైనా కరీంనగర్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. ఈయన కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి, పర్యటన చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్, ఇప్పటికే కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తానికి కరీంనగర్ ఎంపీ స్థానం పై మూడు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. చూడాలి మరీ కరీంనగర్ ఓటర్లు ఎవరిని అదరిస్తారో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…