పండుగ వేళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే.. టికెట్ ధరపై భారీ డిస్కౌంట్!
TGSRTC Sankranti offer: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు TSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుగు ప్రయాణం టికెట్‌తో కలిపి బుక్ చేసుకుంటే మొత్తం టికెట్ ధరపై 10% రాయితీని అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీల నుండి ప్రయాణికులకు ఉపశమనం కల్పించడంతో పాటు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. పండగకు ఆర్టీసీ బస్సుల్లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టికెట్ ధరపై రాయితీ కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే అది అందరికీ కాదు.. ఎవరైతే వెళ్లేటప్పుడు తిరుగు ప్రయాణంకి కూడా టికెట్‌ను బుక్ చేసుకుంటారో.. వారికే మాత్రమే టికెట్ ధరపై 10 ఈ రాయితీ వర్తిస్తుందని తెలంగాణ ఆర్టీసీ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే ఫ్రీ బస్సు ద్వారా ప్రజాధరణ పొందుతుంది ఆర్టీసి. ఇంతకు ముందు కేవలం ఏసీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే రాయితీలను కల్పించే ఆర్టీసీ.. ఇప్పుడు సామాన్య ప్రజలను సైతం ఆకర్షించేందుకు ఈ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఆర్టీసీ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో పండుగ వేళల్లో ప్రయాణికులకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
పండుగ వేళల్లో సొంతూళ్లకు వెళ్లాలంలే ప్రైవే ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే కాకుండా రాష్ట్రంలో ప్రీ బస్సు పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతున్నప్పటికీ.. పురుషులకు మాత్రం ఎలాంటి వెసులుబాటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ చేసుకునే పురుషులకు, ఇతర ప్రయాణికు ఆకర్షించేందుకు ఆర్టీసీ ఈ రాయితీని కల్పిస్తోంది.
Advance Booking = Smart Booking! 💡Book your return ticket in advance and get 10% OFF on your bus fare 🚍✨
🔗 https://t.co/Pqr2EOGmhI#TGSRTC #10PercentOff #BusJourney #Telangana #Hyderabad #SmartTravel pic.twitter.com/mds97EgrKn
— TGSRTC (@TGSRTCHQ) December 23, 2025
గతంలోనూ ప్రయాణికులకు ఆకర్షించేందుకు ఆర్టీసీ అనేక ఆఫర్లను ప్రకటించింది. ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన ఏసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ధరల్లో ప్రత్యేక మినహాయింపులు కల్పించింది. అలాగే సీనియర్ సిటిజన్లలకు టి-9 టికెట్ పేరుతో తక్కువ ధరకే రోజంతా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఇలా ఆర్టీసీ తెచ్చిన అనేక మినహాయింపులతో ఆర్టీసీ ఎప్పికటప్పుడూ ప్రయాణికులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




