TGSRTC: తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్.. ఆ రూట్‌లో వెళ్లే ప్రయాణీకులకు పండగే

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ రూట్‌లో ప్రయాణించే వారికోసం డిస్కౌంట్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్.. ఆ రూట్‌లో వెళ్లే ప్రయాణీకులకు పండగే
TGSRTC Offer
Follow us

|

Updated on: Sep 04, 2024 | 3:07 PM

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికోసం తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ మార్గంలో ప్రయాణాలు జరిపే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు TGSRTC తెలిపింది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tgsrtcbus.in వెబ్ సైట్‌ని సంప్రదించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో వాహనాల రాకపోకలు పున: ప్రారంభమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఐతవరం వద్ద నేషనల్ హైవేపై వరద పోటెత్తడంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం నందిగామ మండలంలో మున్నేరు వాగుకు వరద ఉదృతి తగ్గుముఖం పట్టినందున తిరిగి రాకపోకలు పునరుద్ధరించారు. అయితే బోర్డర్‌లో గరికపాడు వద్ద ఉన్న పాత బ్రిడ్జి డ్యామేజ్ అయినందున… కొత్త బ్రిడ్జిపై నుండి మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పి వాహనదారులకు సూచించారు. బ్రిడ్జ్‌పై అతి వేగంగా వాహనాలు నడపొద్దని కోరారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..