AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. ఛార్జీలు ఏకంగా 30 శాతం తగ్గింపు.. మార్చి 1 నుంచి అమలు..

సమ్మర్ మొదలవుతోంది. దీంతో ఏసీ బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడనుంది. ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బస్సుల్లో ఛార్జీలను భారీగా తగ్గించింది.

Telangana: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. ఛార్జీలు ఏకంగా 30 శాతం తగ్గింపు.. మార్చి 1 నుంచి అమలు..
Tgsrtc
Venkatrao Lella
|

Updated on: Feb 18, 2026 | 12:44 PM

Share

ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ తీపికబురు అందించింది. ఇప్పటికే రాష్ట్రంలో సమ్మర్ మొదలైనట్లు కనిపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మొన్నటివరకు చలి పులి వణికించగా.. ఇప్పుడు ఆ తీవ్రత తగ్గి భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఎండకాలం వస్తున్న క్రమంలో ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రజలు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో ప్రజలకు బస్సుల్లో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో ఛార్జీలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలో తిరిగే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మాత్రమే ఈ తగ్గింపు అమలు కానుంది. దీంతో నగరవాసులు ఎండ వేడి, ఉక్కబోత సమస్య నుంచి బయటపడనున్నారు.

ఏయే బస్సుల్లో అంటే..?

నగర పరిధిలో సేవలు అందించే సిటీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో అన్నింటిల్లోనూ 30 శాతం వరకు ఛార్జీలు తగ్గించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి మే నెలాఖరు వరకు ఈ తగ్గింపు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఛార్జీ ఎక్కువగా వసూలు చేస్తుండగా.. ఈ తగ్గింపుతో మెట్రో ఎక్స్‌ప్రెస్ ఛార్జీలతో సమానంగా ఏసీ బస్సుల ఛార్జీలు ఉండనున్నాయి. అయితే మహిళలకు ఎప్పటిలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటుంది. టికెట్ తీసుకుని ప్రయాణించేవారికి ఈ తగ్గింపుతో ఛార్జీల భారం తగ్గడంతో పాటు ఎండాకాలంలో సౌకర్యవంతమైన ప్రయాణం ఏసీ బస్సుల్లో లభించనుందని చెప్పవచ్చు. ఇక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సర్వీసులు అందించే పుష్పక్ ఏసీ బస్సుల్లోనే 30 శాతం టికెట్ల ఛార్జీలను తగ్గించనున్నారు. దీంతో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

తగ్గనున్న ప్రయాణ ఖర్చు

ప్రస్తుతం నగర పరిధిలో అన్ని ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. వీటిల్లో ఏసీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వీటిల్లో ప్రయాణికుల రద్దీ కూడా భారీగా ఉంటుంది. ఎండాకాలంలో ఏసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరగనుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం హైదరాబాద్‌లోని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మాత్రమే తగ్గింపు అమల్లో ఉంటుంది. మిగతా ప్రాంతాలకు తిరిగే ఏసీ బస్సులకు ఈ తగ్గింపు వర్తించదని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అటు హైదరాబాద్‌లో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో తిప్పనుంది.

Follow Us
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే