AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాస్టల్ లో పదో తరగతి విద్యార్థుల మందు పార్టీ.. అత్యుత్సాహం చూపి అడ్డంగా దొరికిపోయారు

మరికొద్ది రోజుల్లో పరీక్షలు. సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీలు. సరదాగా కింది తరగతి విద్యార్థులతో పార్టీ చేసుకుంటామని వార్డెన్ ను కోరారు. ఆయన సరే అనడంతో ఆనందంతో గంతులేశారు. వార్డెన్ ఉన్నంతవరకు బాగానే...

హాస్టల్ లో పదో తరగతి విద్యార్థుల మందు పార్టీ.. అత్యుత్సాహం చూపి అడ్డంగా దొరికిపోయారు
Students Wine Party
Ganesh Mudavath
|

Updated on: Apr 21, 2022 | 9:19 AM

Share

మరికొద్ది రోజుల్లో పరీక్షలు. సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీలు. సరదాగా కింది తరగతి విద్యార్థులతో పార్టీ చేసుకుంటామని వార్డెన్ ను కోరారు. ఆయన సరే అనడంతో ఆనందంతో గంతులేశారు. వార్డెన్ ఉన్నంతవరకు బాగానే ఉన్న విద్యార్థులు.. అతను వెళ్లిపోగానే రెచ్చిపోయారు. బయటి నుంచి బీర్ బాటిళ్లు తెప్పించుకుని మద్యం తాగారు. అంతే కాకుండా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ అయ్యి, ఉన్నతాధికారుల వద్దకు చేరింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి బీసీ బాయ్స్ హాస్టల్ లో విద్యార్థులు ఈ ఘటనకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 17 ఆదివారం రాత్రి కింది తరగతి విద్యార్థులతో ఫేర్వెల్ పార్టీ చేసుకుంటామని వార్డెన్​ను కోరారు. వారి విజ్ఞప్తిని మన్నించిన వార్డెన్.. వంటమనిషితో చికెన్​ చేయించారు. విద్యార్థులందరూ భోజనం చేసిన తర్వాత వార్డెన్​ఇంటికి వెళ్లిపోయాడు. ఇక అప్పుడు మొదలైంది అసలు కథ.. ఇదే అదనుగా భావించిన విద్యార్థులు హాస్టల్ వెనుక నుంచి బీర్ బాటిల్స్ తెప్పించుకున్నారు. అందరూ కూర్చొని చికెన్​తో పాటు మద్యం తాగారు. అంతటితో ఆగకుండా బీర్ తాగుతున్నప్పుడు ఫొటోలు తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు కాస్తా వైరల్ అయ్యి, అధికారుల దృష్టికి వెళ్లింది. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ బీసీ డెవలప్​మెంట్​ఆఫీసర్​భాగ్యమతి.. హాస్టల్​లోని విద్యార్థులను విచారించారు. తల్లిదండ్రుల పిలిపించారు. వారి ముందు విద్యార్థులకు కౌన్సెలింగ్​ఇచ్చారు.

హస్టల్​లో విద్యార్థులు పార్టీ చేసుకున్నారన్న విషయం తెలియగానే వారిని మందలించినట్లు అసిస్టెంట్ బీసీ డెవలప్​మెంట్​ఆఫీసర్​భాగ్యమతి అన్నారు. వార్డెన్​తో మాట్లాడి పర్మిషన్​ తీసుకున్నారని.. వంటమనిషితోనే చికెన్​ వండించుకున్నారని చెప్పారు. హాస్టల్​వార్డెన్ బయటికి వెళ్లిపోయాక బయటి మిత్రులతో బీరు బాటిళ్లు తెప్పించుకుని తాగారని వివరించారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లే వసతి గృహంలో విద్యార్థులు మద్యం సేవించారని వెల్లడించారు. నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్​పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read

UK PM Johnson: నేడు అహ్మదాబాద్‌కు చేరుకోనున్న బ్రిటన్‌ ప్రధాని.. రేపు ప్రధాని మోడీతో సమావేశం

Delhi: దేశ రాజధానిలో దారుణం.. బీజేపీ నాయకుడి దారుణ హత్య.. ఇంటి ముందే తుపాకులతో..

Kieron Pollard: కీరన్‌ పొలార్డ్‌ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు.. ఆందోళనలో ముంబై ఫ్యాన్స్‌..