Delhi: దేశ రాజధానిలో దారుణం.. బీజేపీ నాయకుడి దారుణ హత్య.. ఇంటి ముందే తుపాకులతో..
BJP leader shot dead: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన ఢిల్లీలోని మయూరు విహార్ ప్రాంతంలో బుధవారం రాత్రి..
BJP leader shot dead: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన ఢిల్లీలోని మయూరు విహార్ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు జీతూ చౌదరి (Jitu Chaudhary) గా పోలీసులు గుర్తించారు. జీతూ మయూర్విహార్జిల్లా బీజేపీ యూనిట్‌కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మయుర్విహార్ (Mayur Vihar)ప్రాంతంలోని ఫేజ్ 3లో నివసించే జీతూ చౌదరి బుధవారం రాత్రి తన ఇంటి బయటకు వచ్చి నిల్చొని ఉన్నాడు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వచ్చి జీతూపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ క్రమంలో తల, కడుపు భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటన రాత్రి సుమారు 8.15 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. కాల్పులకు గురైన జీతూను స్థానికులు, కుటుంబసభ్యులు హుటాహుటిన నోయిడాలోని మెట్రో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జీతూ చౌదరి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జీతూ మరణవార్త తెలియగానే బీజేపీ ప్రాంతీయ నాయకులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Also Read: