Anakapalli: పుష్ప.. ఇంతటి దారుణానికి పాల్పడింది అందుకేనంటా..! అబ్బాయి సమక్షంలోనే కత్తిని కొని..

Anakapalli: పుష్ప ది నైఫ్ కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లంటే ఇష్టం లేని పుష్ప.. తన మనసులో ఉన్న మాటను ఎవరికి చెప్పక.. లోలోన దాచుకుని చివరకు కాబోయే వరుడినే అంత..

Anakapalli: పుష్ప.. ఇంతటి దారుణానికి పాల్పడింది అందుకేనంటా..! అబ్బాయి సమక్షంలోనే కత్తిని కొని..
Anakapalle Pushpa Case
Follow us
Surya Kala

|

Updated on: Apr 21, 2022 | 6:41 AM

Anakapalli: పుష్ప ది నైఫ్ కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లంటే ఇష్టం లేని పుష్ప.. తన మనసులో ఉన్న మాటను ఎవరికి చెప్పక.. లోలోన దాచుకుని చివరకు కాబోయే వరుడినే అంత మొందించబోయింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలపై ఎక్కబోయే పుష్ప.. జైలుకెళ్ళింది. అయితే బహుమతి మాటున జరిగిన ఈ క్రైం కథలో.. కత్తి దే కీ రోల్. ఇంతకీ పుష్ప క్రైం కహానిలో కత్తి కథేంటి..? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లాలో కాబోయే వరుడిపై హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రావికమతంకు(Ravikamatam) చెందిన పుష్ప.. మాడుగుల ఘాట్ రోడ్(Madugula Ghat Road) ప్రాంతానికి చెందిన రామునాయుడు(RamuNaidu) తో వివాహం నిశ్చయమైంది. ఈనెల 4 న నిశ్చితార్ధం కూడా అయింది. వచ్ఛే నెల 20న పెళ్లి ముహూర్తం. ఇంతలో కాబోయే వరుడ్ని పిలిచి దాడి..! ఇదంతా తేలిసిందే.

అయితే ఓ సాధారణ యువతి హత్య చేసేలా పుష్ప ప్లాన్ ఎలా చేసింది. ప్రేమగా మాట్లాడుతూ.. ఎక్కడా అనుమానం రాకుండా… కత్తిని రాము నాయుడుతోనే ఉంటూనే కొనుగోలు చేసింది. కనీసం ఆ యువకుడికి అనుమానం కూడా రానివ్వలేదు. అయితే పుష్ప ఆ కత్తి ప్లాన్ ఎలా చేసింది. తల్లికి కూడా కనీసం కూతురిపై అనుమానం రాలేదు. ఘటన జరిగిన తరువాత కూడా తన కూతురిది ఏమి తప్పులేదనే వాదించింది తల్లి. అయితే ఈ కత్తి ప్లాన్ తెలిసిన పోలీసులే అవాక్కయ్యారు.

పెళ్లంటే ఇష్టం లేని పుష్ప.. తనలో తాను పెళ్లిని ఎలా తప్పించాలనే విషయంపై ఆలోచించడం ప్రారంభించింది.  రాము నాయుడు తో పెళ్లి ఫిక్స్ అయినా పుష్పకు ఇష్టం లేదు. ఇంట్లో చెబితే ఏమనుకుంటారో అని మనసులోనే దాచుకుంది. నిశ్చితార్ధం జరిగి పెళ్లి తేదీ దగ్గరపడే కొద్దీ తనలో ఒకావిధమైన ఆందోళన మొదలైంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి రాము నాయుడు వచ్చినట్టు తెలుసుకుని అతనిని రమ్మని కోరింది. కాబోయే భార్య పిలిచింది కదా అని పుష్ప ఇంటికి వెళ్ళాడు రాము నాయుడు. అక్కడ ఇంట్లో వారితో కలిసి భోజనం చేశాడు. ఆ తరువాత 12గంటలకు తరువాత బయటకు వెళదామని కోరింది. సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు వెళ్ళేందుకు బస్సుకు టికెట్ కూడా రిజర్వేషన్ చేయించుకున్న రాము నాయుడు.. పుష్ప కోరిక కాదనలేక ఆమెతో పాటు బయలుదేరాదు.

అయితే అప్పటికే పుష్ప అతడిని చంపాలని ప్లాన్ చేసుకున్నా.. తన ప్రవర్తనలో మార్పు అతనికి తెలియకుండా జాగ్రత్త పడింది. పుష్ప ప్రవర్తనలో తేడా కనిపించకపోవడంతో ఆమె మనసులో ఉన్న మర్మాన్ని గుర్తించలేకపోయాడు రాము నాయుడు. ఇంటినుంచి బయలుదేరి కాస్త దూరం వెళ్ళాక.. పన్నెండున్నర ప్రాతంలో వడ్డాది లోని ఓ ఫ్యాన్సీ షాపు వద్ద బండి ఆపమంది పుష్ప. ఎందుకు అని ప్రశ్నిస్తే చెబుతానని అంది. షాపు లోపలకు వెళ్లిన పుష్ప క్యాజువల్ గానే కత్తి కావాలని అడిగింది. దీంతో రెండుమూడు రకాల కత్తులను చూపించిన షాపు నిర్వాహకుడు రేట్లు కూడా చెప్పాడు. అయితే వాటిలో పసుపు రంగు ప్లాస్టిక్ పిడి కలిగిన చాకును సెలెక్ట్ చేసుకుంది పుష్ప. ఇరవై రూపాయలు చెల్లించింది. కత్తిని అలాగే ఇచ్ఛే సరికి ప్యాక్ చేయాలని షాపు నిర్వాహకుడికి కోరింది. దీంతో పేపర్ ను చుట్టి ఇవ్వడంతో దానిని పట్టుకుని రాము నాయుడుకు కనిపించకుండా జాగ్రత్త పడింది. ఏమిటి ఇది ప్రశ్నించిన రాము నాయుడుకు.. ఓ సర్పరైజ్ గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చింది. అప్పటికీ రాము నాయుడుకు కొంచెం కూడా అనుమానం రాలేదు. అక్కడ నుంచి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారని చెప్పి.. కోమల్లపూడి ఆశ్రమం కొండ పైకి తీసుకెళ్లింది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి ప్రశ్నిస్తే కాసేపట్లో వస్తారని చెప్పింది. అయినప్పటికీ రాము నాయుడుకు డౌట్ రాలేదు.

కాసేపు అక్కడ ఇద్దరూ సరదాగా గడిపారు. ఉత్సాహంగా సెల్ఫీ కూడా తీసుకున్నారు. దాడి చేయాలనే ఆలోచన ఉన్నా.. ఎక్కడా అనుమానం రాకుండా పుష్ప స్వయంగా తన సెల్ ఫోన్లో కాబోయే వరుడితో సెల్ఫీ తీసుకుంది. అయితే.. తెచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన పుష్ప.. ఇక తన ప్లాన్ అమలుచేయాలని సిద్ధమైంది. కళ్ళు మూసుకోకపోయే సరికి చున్నీతో తానే స్వయంగా గంతలు కట్టింది. ఇక చివరి నిమిషంలో ఆమె మాటలు, అక్కడ పరిస్థితులు పై ఏదో తేడా అనిపించడంతో రాము తెరుకునే లోపే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నట్లు నటిస్తూ కత్తితో గొంతుకోసి సర్ ప్రైజ్ ఇచ్చింది.

రాము గొంతు కోసిన అనంతరం పుష్పాలో భయం నెలకొంది. అయినప్పటికీ అప్పటికే జరగాలసిన దారుణం  జరిగిపోయింది. రామునాయుడు కాస్త తెరుకున్నాడు కాబట్టి ప్రాణాలతో బతికి బట్టకట్టాడు. అలాగే ఉండిపోతే ఆ కత్తి ఇంకా గొంతు లోకి దిగి ప్రాణాలు పోయేవి. ఇది కత్తి క్రైం కథా చిత్రం. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవాలానే మనసులో వచ్చిన ఆలోచన.. బయటకు చెప్పకుండా ఉండడమే ఇంతటి దారుణ పరిస్థితులకు దారితీసింది. పోనీ ఆమెకు ఇంకా ఏదైనా వ్యాపకాలున్నాయా అంటే అదీ లేదు. మనసులో ఏదో పెట్టుకుని.. లోలోన మదనపడి చివరకు నేరస్తురాలిగా మారింది పుష్ప. పుష్ప చేతిలో గాయడిన రామునాయుడు ఆసుపత్రి పాలై బతికి బట్టకట్టాడు. పుష్ప చేసిన నేరానికి జైలు పాలైంది. సరదాగా వివాహం వేడుక కోసం కలలుకన్న రెండు కుటుంబాలు తీవ్ర ఆవేదన లోకి వెళ్లాయి. అదృష్టం కొద్దీ కత్తి అంతగా గొంతులో దిగలేదు. లేకుంటే..! రామునాయుడు ప్రాణాలు పోయేవి. దానికి తోడు పుష్ప కూడా భయంతో ప్రాణాలు తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అందుకే ఏదైనా ఉంటే నలుగురితో షేర్ చేసుకోవాలి అంటారు మానసిక నిపుణులు. బి కేర్ ఫుల్..!

Reporter: khaja  , TV9 Telugu 

Read Also: Hyderabad: ఇవాళ హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం.. పూర్తి వివరాలివే..

Gold Smuggling: వామ్మో.. వీడి తెలివి తగలెయ్యా! బట్టతలలో దాచి బంగారం స్మగ్లింగ్‌.. విగ్గు తీసి చూసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్‌..